News

National

బెంగళూరులో కుప్పకూలుతున్న విద్యుత్ స్థంభాలు, కాలిపోతున్న ట్రాన్స్ ఫార్మర్లు !

బెంగళూరు: బెంగళూరు సిటీతో పాటు కర్ణాటకలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, భారీ గాలుల దెబ్బకు పెద్దపెద్ద చెట్లతో పాటు విద్యుత్ స్థంభాలు నేలమట్టం అవుతున్నాయి. బెంగళూరు సిటీ పరిధిలో బెస్కామ్ కు చెందిన సుమారు 540 విద్యుత్ స్థంభాలు కుప్పకూలడంతో విద్యుత్ సరఫరా ఆగిపోయి ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 12 ఏళ్ల తరువాత ఎమ్మెల్యేగా అసెంబ్లీలో బళ్లారి గాలి జనార్దన్ రెడ్డి, ఏం చెప్పారంటే ! బెంగళూరు సిటీతో పాటు…

TELANGANA

ఇది సారు- కారు-60 పర్సెంట్ కమీషన్ల సర్కార్: బండి సంజయ్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. కెసిఆర్ కబంధహస్తాల్లో తెలంగాణ రాష్ట్రం చిక్కుకుందని పేర్కొన్న ఆయన, కెసిఆర్ కబంధహస్తాల నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తామన్నారు. దళిత బంధులో 30 శాతం, ఎమ్మెల్యేల నుండి మరో 30 శాతం సీఎం కుటుంబానికి మొత్తంగా 60 శాతం కమిషన్ గా వెళుతుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, సచివాలయ నిర్మాణంతోపాటు, భూదందాలలో…

CINEMA

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటుడు మృతి.. అసలేం జరిగిందంటే..!

బుల్లితెర సీరియల్ నటుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఏటూరునాగారం మండలం రొయ్యూర్‌ గ్రామానికి చెందిన కుమ్మరి బాలు (32) బుల్లితెర నటుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బాలుకు అయినవారు ఎవరు లేకపోవడంతో కొన్నేళ్ల క్రితం స్వగ్రామం నుంచి హైదరాబాద్‌ వచ్చి అక్కడే స్థిరపడ్డారు. టీవీ సీరియల్స్‌లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ ఉండేవాడు. తన నటనతో ఇప్పుడిప్పుడే మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు బాలు. ఈ క్రమంలో మే 18న స్నేహితుడి వివాహానికి బైక్‌పై హైదరాబాద్‌…

CINEMA

ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో సీఎం జగన్ పేరెత్తగానే – నారాయణ మూర్తి వ్యాఖ్యలతో..!!

హైదరాబాద్ వేదికగా ఎన్టీఆర్ శతజయంత వేడుకలు జరిగాయి. రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇదే సమయంలో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని పలువురు ముక్త కంఠంతో డిమాండ్ చేసారు. ఎన్టీఆర్ కు భారతరత్న వచ్చే వరకూ పోరాడుతామని చంద్రబాబు ప్రకటించారు. ఈ సభలో నటుడు ఆర్ నారాయణ మూర్తి ఇదే అంశం పైన స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీ సీఎం జగన్ పేరును ప్రస్తావించారు. ఎన్టీఆర్ కు…

CINEMA

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ మృతి

టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. కొద్ది సేపటి క్రితం ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ మృతి చెందారు. అనారోగ్య కారణాలతో రాజ్ మరణించినట్లు తెలిసింది. ‘రాజ్ – కోటి’ ద్వయంలో ఒకరిగా పేరు గాంచిన రాజ్ మరణ వార్త తెలుగు సినీ పరిశ్రమను విషాదంలోకి నెట్టేసింది. తెలుగు సినీ పరిశ్రమకు ప్రముఖ సంగీత దర్శకుల్లో రాజ్- కోటి ద్వయం ఒకటి. తొంభైల్లో వచ్చిన సినిమాల్లో రాజ్ కోటి కాంబో సినిమాలకు మంచి డిమాండ్ ఉండేది.…

APTELANGANA

ప్రయాణికులు జాగ్రత్త! స్లీపర్ కోచ్ బస్సుల్లో సెక్స్ – మూసి తలుపుల వెనుక వ్యభిచారం!

చెన్నై మే 20: ప్రయాణీకుల భద్రత, సౌకర్యవంతమైన ప్రయాణం కోసం స్లీపర్ కోచ్ బస్సులను ప్రవేశపెట్టారు. ఇంతకీ ఈ బస్సులు ఎంత వరకు సేఫ్ అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చెన్నైలోని ఉలుందూర్‌పేట టోల్ సమీపంలో స్లీపర్ కోచ్ బస్సులో అత్యాచారం ఘటన ప్రయాణికులను కలచివేసింది. అందువల్ల లాడ్జీల్లో దాడులు చేస్తున్నట్లే ఓమ్నీ స్లీపర్ కోచ్ బస్సులపై కూడా దాడులు చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఆర్డినరీ బస్సుల కంటే ఇప్పుడు ఆమ్నీ బస్సులు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఇవి…

APTELANGANA

నా డబ్బులు నాకు వొచ్చాయి.. ఇక పోయివొస్తా..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో కష్టపడకుండా అధికంగా లాభపడిన ఆటగాడు ఎవరైనా ఉన్నారా అంటే..? అది చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్ రౌండర్ బెన్‌ స్టోక్స్‌ అని చెప్పొచ్చు.. ఈ 16.25 కోట్ల ఆటగాడు సీజన్‌ మొత్తంలో ఆడింది రెండే మ్యాచ్‌లు. అందులో అతను చేసిన పరుగులు కూడా 16 మాత్రమే. అంటే ఒక్కో పరుగుకు సీఎస్కే యాజమాన్యం కోటి రూపాయలపైగానే చెల్లించింది అన్న మాట. ఇంత ఘనకార్యం వెలగబెట్టిన ఈ ఇంగ్లీష్‌ ఆల్‌రౌండర్‌ ఇప్పుడు…

TELANGANA

కాంగ్రెస్‌లో నాలుగు స్తంభాల ఆట సాగుతుంది

ప్రభుత్వ కార్యాలయాలకు పేదోళ్ళ భూములను లాకుంటున్నారని ఆరోపించారు తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్. 33 జిల్లాల్లో ప్రభుత్వ భూములు రూపాయి లీజ్ పేరిట తీసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. కేబినెట్ మీటింగ్ తరువాత మంత్రి అబద్ధాలు చెప్పారని ఆయన ఆరోపించారు. కోకాపేటలో 11 ఎకరాల విలువైన స్థలాన్ని ఓ సంస్థ పేరుమీద తీసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కోకాపేట భూముల మీద కేబినెట్ మీటింగ్ జరిగింది.. కానీ అది చెప్పలేదని, బీఆర్ఎస్ పార్టీ 11 ఎకరాలకు కేవలం 40…

NationalTechnology

రూ 500 నోట్లు కూడా రద్దవుతాయా – ఏం జరుగుతోంది…!!

రిజర్వ్ బ్యాంక్ తాజాగా రెండు వేల నోట్లను ఉప సంహరించుకుంది. ఇప్పటికే వీటి ముద్రణ నిలిపివేయటంతో సామాన్యుల పైన అంతగా ప్రభావం ఉండే అవకాశం లేదు. ఇప్పటి వరకు సర్క్యులేషన్ లో ఉన్న రెండు వేల నోట్లు 2017 ముందు జారీ చేసినవి. వీటిని మార్చుకోవటానికి…డిపాజిట్ కు సెప్టెంబర్ 30వ తేదీ వరకు సమయం ఉంది. పెద్ద నోట్లు రద్దు అనే లక్ష్యంలో భాగంగా తీసుకుంటున్న ఈ నిర్ణయాలతో రూ 500 నోట్లు కూడా రద్దు చేస్తారా…

National

కొత్త మేయర్లకు యోగీ ఆదిత్యనాథ్ కీలక సూచన- ఇక మీ కాళ్లపై మీరే…

తాజాగా జరిగిన యూపీ స్ధానిక సంస్ధల ఎన్నికల్లో అధికార బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ఎన్నికలు జరిగిన మొత్తం 17 కార్పోరేషన్లను కాషాయ పార్టీ తమ ఖాతాలో వేసుకుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో గెలిచిన వారిలో ఆరుగురు మేయర్లు సీఎం యోగీ ఆదిత్యనాథ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలిపిన సీఎం యోగీ.. పలు కీలక సూచనలు కూడా చేశారు. ఇందులో వారు ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పోరేషన్లను స్వశక్తిపై నిలిచేలా చేయాలన సూచించారు.…