News

APNationalTELANGANA

ఏపీకి మరో వందేభారత్?

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వందే భారత్ రైళ్లు పట్టాలపై శరవేగంగా పరుగులు తీస్తున్నాయి. ప్రతి ప్రయాణికుడికి ఒకసారి వందే భారత్ ఎక్కాలనే యోచనను కల్పిస్తున్నారు. ఏపీ, తెలంగాణకు కలిపి ప్రస్తుతం రెండు వందేభారత్ రైళ్లు ప్రవేశపెట్టారు. ఒకటి సికింద్రాబాద్ నుంచి తిరుపతికి, మరొకటి సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు తిరుగుతోంది. తాజాగా తెలుగు రాష్ట్రాలకు మరో వందేభారత్ కేటాయించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వేస్టేషన్ లో వందే భారత్ 10 నిముషాలు ఆగింది. రాత్రి…

SPORTS

అరుదైన ప్రదర్శనతో 15 ఏళ్ల రికార్డు బద్దలు..

ఈ ఏడాది రాజస్తాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్ 2023 సీజన్ లో విశేషంగా రాణిస్తున్న యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ చరిత్రనే తిరగరాశాడు. ఐపీఎల్ చరిత్రలో ఓ సీజన్ లో ఓ ఆటగాడూ సాధించని ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే లీగ్ దశలో మ్యాచ్ ల్లో తన అద్భుత ప్రదర్శనతో టీమ్ కు వరంగా మారిన యశస్వీ ఇప్పుడు రాజస్తాన్ ప్లే ఆఫ్స్ కు కూడా చేరితే తాను సాధించిన రికార్డును మరింత మెరుగుపర్చుకోవడం…

APNational

కేంద్ర క్యాబినెట్ మంత్రిగా పని చేసి ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి !

బెంగళూరు: కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇప్పుడు మిగిలిన ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని ప్రయత్నిస్తున్నది, సిద్దరామయ్య, డీకే శివకుమార్ లను రాజీ చెయ్యాలని నానా తంటాలు పడిన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇప్పుడు కర్ణాటకలో తన మార్క్ మత్రివర్గాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీకి ఊహించిన షాక్ ఇచ్చిన గాలి జనార్దన్ రెడ్డి, సిద్దరామయ్య పక్కన ప్రత్యక్షం ! శనివారం ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేశారు. ముందుగా వేసుకున్న…

APTELANGANA

ఈ ఏడాది చివరి సూర్య, చంద్ర గ్రహణాలు

ఈ ఏడాది ఇప్పటికే తొలి సూర్య, చంద్రగ్రహణాలు ఏర్పడ్డాయి. రెండోది, చివరిది అయిన గ్రహణాలు అక్టోబరులో రాబోతున్నాయి. ఈ రెండు గ్రహణాల మధ్య 15 రోజుల అంతరం ఉంటుంది. అశ్వినీ అమావాస్య రోజు సూర్యగ్రహణం, అశ్వినీ పూర్ణిమ రోజు చంద్ర గ్రహణం కనిపించనున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చివరి సూర్య గ్రహణం అక్టోబర్ 14వ తేదీ రాత్రి 8.34 గంటలకు ప్రారంభమవుతుంది. కన్యా రాశి, చిత్తా నక్షత్రంలో : అక్టోబర్ 15వ తేదీ తెల్లవారుజామున 2.25 గంటలకు…

NationalPOLITICS

పొత్తులపై పవన్ కళ్యాణ్ సూచనలపై బీజేపీ అధిష్టానం ఆలోచిస్తుంది: బీజేపీ ఎంపీ జీవీఎల్

ఏపీ మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు నోరు అదుపులో పెట్టుకోవాలని, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే సహించమని హెచ్చరించారు. నేడు గన్నవరంలో సోము వీర్రాజు అధ్యక్షతన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఏపీ బీజేపీ నేతలతో పాటు పాల్గొన్న ఎంపీ జీవీఎల్ నరసింహారావు వైసిపి అవినీతిపై మండిపడ్డారు. వైసిపి అవినీతిపై చార్జిషీట్, మోడీ పాలనలో జరిగిన మంచిని ప్రజల్లోకి తీసుకువెళ్లడం అజెండాగా…

National

వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ తోపాటు మెడ్ ట్రానిక్ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు

హైదరాబాద్: రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగుతోంది. ఇప్పటికే పలు ప్రముఖ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి. తాజాగా, అమెరికాకు చెందిన ప్రొడక్ట్ ఇంజినీరింగ్, సొల్యూషన్స్ సంస్థ అయిన జాప్‌కామ్.. హైదరాబాద్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జాప్‌కామ్ సీఈవో కిషోర్ పల్లం రెడ్డి సహా ఆ సంస్థ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ జరిపిన సమావేశంలో ఈ మేరకు ఒప్పందం కుదిరింది. పర్యాటకం, ఆతిథ్యం, ఫిన్‌టెక్,…

National

మహారాష్ట్రలో ఎన్నికల్లో తొలి విజయం; ఖాతా తెరిచిన బీఆర్ఎస్ పార్టీ!!

తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా కాలంగా మహారాష్ట్ర రాజకీయాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్న విషయం తెలిసిందే. మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీని విస్తరించడానికి కెసిఆర్ చేసిన ప్రయత్నాలు ఫలిస్తున్నాయనే చెప్పాలి. తాజాగా మహారాష్ట్ర గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తొలి విజయం నమోదు చేసుకుంది. మహారాష్ట్రలోని అంబే లోహల్ గ్రామంలో జరిగిన గ్రామ పంచాయతీ ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థి గఫూర్ పఠాన్ విజయం సాధించారు. 115 ఓట్ల తేడాతో…

National

దేవుడికి ఏ పండ్లు నైవేద్యంగా పెడితే ఎలాంటి ఫలితం వస్తుంది?

చాలామంది భగవంతుని పూజించే క్రమంలో పండ్లు భగవంతుడికి నైవేద్యంగా పెట్టి తమని అనుగ్రహించమని ప్రార్ధిస్తారు. వివిధ కాలాలలో వచ్చే పండ్లతో పాటు, అరటి పండ్లు, ఆపిల్స్ తదితరాలు భగవంతుడికి నైవేద్యంగా పెడతారు. అయితే ఏ పండ్లు పెడితే ఎటువంటి ఫలితం వస్తుంది? అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం. vastu tips: అప్పుల బాధలు మీకు తగ్గాలా? అయితే ఈ పరిహారాలు చేసి చూడండి!! చాలామంది సహజంగా భగవంతుడికి నైవేద్యంగా పూర్ణ ఫలమైన కొబ్బరికాయను సమర్పిస్తారు. భగవంతుడికి కొబ్బరికాయను…

National

“రూ.2వేల నోటు వెనక్కి” ప్రకటనతో ఆర్బీఐ వెబ్‌సైట్ క్రాష్..!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ ఒక్కసారిగా క్రాష్ అయ్యింది. రూ.2000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటన నేపథ్యంలో అసలు విషయం తెలుసుకునేందుకు చాలామంది నెటిజెన్లు ఆర్బీఐ వెబ్‌సైట్‌ను సందర్శించారు. దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైట్ క్రాష్ అయ్యింది.   రూ.2000 నోట్లు ఇకపై చెలామణిలోకి రావని వాటిని ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ శుక్రవారం ప్రకటన చేసింది. అయితే రూ.2000 నోట్లను పూర్తిగా రద్దు చేయడం లేదని స్పష్టం చేసిన ఆర్బీఐ…

APTELANGANA

జ్ఞానవాపి మసీదు: అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే

న్యూఢిల్లీ: వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మసీదులోని వాజుఖానాలో బయటపడిన శివలింగం వయస్సును నిర్ధారించేందుకు కార్బన్ డేటింగ్ పరీక్షలకు అలహాబాద్ హైకోర్టు ఇటీవల అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా, అలహాబాద్ హైకోర్టు తీర్పుతో సుప్రీంకోర్టు విభేధించింది. ఈ అంశంపై మరింత లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ కార్బన్ డేటింగ్ నిర్వహించొద్దంటూ హైకోర్టు తీర్పుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం…