News

POLITICS

సిద్దూ సీఎం అని డీకే శివకుమార్ తోనే చెప్పించిన కాంగ్రెస్, స్కెచ్ అంటే అదేనా మేడమ్?

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్యను ప్రకటిస్తున్నామని స్వయంగా డీకే శివకుమార్ చెప్పడం ఆయన అభిమానులు, ఆయన వర్గంలోని నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. గురువారం రాత్రి సీఎల్ పీ సమావేశం జరిగిన తరువాత కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కర్ణాటకకు కాబోయే సీఎం సిద్దరామయ్య అని ప్రకటించారు. ముచ్చటగా మూడు కారణాలతో సీఎం రేసు నుంచి తప్పుకున్నా, డీకే శివకుమార్ మాటతో! సీఎల్ పీ సమావేశం జరుగుతున్న సమయంలో సిద్దరామయ్య ఏం మాట్లాడుతారు ?, డీకే శివకుమార్ ఏం మాట్లాడుతారు…

National

దిద్దుబాటు చర్యల్లో ప్రధాని మోడీ.. న్యాయ శాఖ సహాయ మంత్రి కూడా ఔట్

సుప్రీంకోర్టుకు, కేంద్ర న్యాయశాఖకు మధ్య చెలరేగిన వివాదం ప్రధాని నరేంద్ర మోడీ సర్కారుకు చెడ్డ పేరునే ఆపాదించిందని చెప్పొచ్చు. జడ్జీల నియామకం విషయంలో సుప్రీంకోర్టు కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధులకు కూడా చోటు కల్పించాల్సిందేనంటూ కేంద్ర న్యాయశాఖామంత్రిగా ఉన్న కిరణ్ రిజిజు పదేపదే వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. పైగా, సుప్రీంకోర్టును శాసించేందుకు ప్రధాని మోడీ సర్కారు ప్రయత్నిస్తుందనే విమర్శలు సైతం వచ్చాయి. అయినప్పటికీ ప్రధాని మోడీ లేదా కేంద్రం హోం మంత్రి అమిత్…

CINEMA

కేవలం 22 మ్యాచ్‌లకే కెరీర్ ఎండ్.. సీన్ కట్ చేస్తే రాజకీయాల్లో సూపర్ హిట్..

చాలా మంది ఆటగాళ్లు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో సత్తా చాటి టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే.. అందులో కొందరి ప్లేయర్స్ కెరీర్ ఎక్కువ కాలం కొనసాగలేదు. కొన్ని మ్యాచులు మాత్రమే ఆడి.. టీమిండియా నుంచి ఔట్ అయ్యారు. టీమిండియా మాజీ క్రికెటర్ అశోక్ దిండా కథ కూడా ఇదే. అతను టీమ్ ఇండియా తరఫున 22 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. టీమిండియాలో అతని కెరీర్ ఎక్కువ కాలం కొనసాగలేదు. అశోక్ దిండా క్రికెట్ కెరీర్ కథ…

TELANGANA

ఇవేం ఉత్తర్వులు- వివేకా కేసులో తెలంగాణ హైకోర్టు తీరుపై సీజేఐ చంద్రచూడ్ ఆశ్చర్యం..

ఏపీలో తీవ్ర సంచలనం రేపిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రోజుకో సంచలనం నమోదవుతూనే ఉంది. ఇప్పటికే ఈ కేసులో ఓవైపు సీబీఐ వరుసగా అరెస్టులు చేస్తూ నిందితుల్ని ప్రశ్నిస్తోంది. అదే సమయంలో నిందితులు కోర్టుల్ని ఆశ్రయించే బెయిల్ తెచ్చుకునే ప్రయత్నాలూ చేస్తున్నారు. గతంలో బెయిల్ పై బయటికి వచ్చిన మరికొందరు నిందితుల్ని తిరిగి జైల్లో పెట్టించేందుకు సీబీఐ కూడా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు తీసుకున్న ఓ నిర్ణయంపై సుప్రీంకోర్టు సీజే ఆశ్చర్యం వ్యక్తం…

NationalTELANGANA

కరెంట్ బిల్లులు చెల్లించబోమంటున్న కర్ణాటక ప్రజలు.. తలలు పట్టుకుంటున్న విద్యుత్ సిబ్బంది

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించాక ఇంకా ప్రభుత్వాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేయలేదు. అయినప్పటికీ ఆ రాష్ట్రంలోని కొన్ని గ్రామాల ప్రజలు విద్యుత్‌ బిల్లులు చెల్లించమంటున్నారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లు తమ బిల్లులు చెల్లిస్తారని విద్యుత్‌ అధికారులకు చెబుతున్నారు. అయితే ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తామని కాంగ్రెస్‌ తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. దీంతో కొప్పల్, చిత్రదుర్గ కలబురగి వంటి జిల్లాల్లోని పలు…

CINEMA

బయట నుంచి చూస్తే మొక్కజొన్న చేనే.. లోపలికెళ్లి చూస్తే ఉంది అసలు సినిమా

తప్పుడు పనులు చేయడంలో క్రియేటివిటీ వాడుతున్నారు కేటుగాళ్లు. పుష్ప రేంజ్‌లో తగ్గేదే లే అన్నట్లు దూసుకుపోతున్నారు. తమ ఇస్మార్ట్ బుర్రలతో పోలీసులకు, అధికారులకు సవాల్ విసురుతున్నారు. రెండు దమ్ములు లాగగానే కిక్కిచ్చే మత్తు పదార్థం గంజాయి ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో విసృతంగా దొరకుతుంది. దీన్ని పీల్చుతూ.. కలల లోకంలో తెలియాడుతూ.. విలువైన జీవితాన్ని పాడుచేసుకుంటున్నారు కొందరు కుర్రాళ్లు. గంజాయి పెంపకం, వినియోగం దేశంలో విపరీతంగా పెరిగింది. అధికారులు కేటుగాళ్లను కేసులు పెట్టి.. జైల్లో వేస్తున్నా.. తమ పద్దతి…

CINEMA

పవన్ తో పొత్తు.. జూ.ఎన్టీఆర్ చిత్తు.. చంద్రబాబు మహా స్కెచ్

ఈ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు కీలకం. ఒకరకంగా జీవన్మరణ సమస్యే. అందుకే చంద్రబాబు చాలా రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏ చిన్న అవకాశాన్ని జారవిడుచుకోవడం లేదు. ప్రత్యర్థులకు అస్సలు చాన్సివ్వదలచుకోలేదు. అయితే చంద్రబాబు ప్రయత్నాలు కొంతవరకూ సఫలీకృతమవుతున్నాయి. ఇటీవల సత్ఫలితాలనిస్తున్నాయి. మొన్నటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం, తరువాత జనసేనతో పొత్తు కుదిరిన సంకేతాలు, బీజేపీ మెత్తబడడం వంటివి కలిసి వస్తున్నాయి. అధికారికంగా పొత్తుల ప్రకటనకు సిద్ధపడుతున్నారు. పనిలో పనిగా నందమూరి కుటుంబసభ్యులను సైతం తనదారిలో…

CINEMA

ఎన్టీఆర్ 30 : సముద్రమంతా అతడు రక్తంతో రాసిన కథలే.

దర్శకుడు కొరటాల శివ ఒక్కో అప్డేట్ తో ఎన్టీఆర్ 30పై అంచనాలు పెంచేస్తున్నాడు. ఎన్టీఆర్ బర్త్ డే నేపథ్యంలో ఫస్ట్ లుక్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. లేటెస్ట్ అప్డేట్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ కలిగిస్తుంది. ఎన్టీఆర్ 30 ఫస్ట్ లుక్ అనౌన్స్మెంట్ పోస్టర్ సైతం మైండ్ బ్లాక్ చేస్తుంది. ‘ఈ సముద్రమంతా అతడు రక్తంతో రాసిన కథలే’ అని పోస్టర్ పై రాశారు. పోస్టర్ లో సాగర తీరాన రక్తంతో తడిసిన ఆయుధాలు ఉన్నాయి.…

National

కర్ణాటకలో ముఖ్యమంత్రి గా సిద్ధరామయ్య

కర్ణాటకలో ముఖ్యమంత్రి గా సిద్ధరామయ్య దాదాపు ఖరారైనట్లే. ఈ విషయాన్ని కాంగ్రెస్ అంగీకరించింది. ఈ సాయంత్రంలోగా సిద్ధరామయ్య పేరును కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించనుంది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య రేపు బెంగళూరులో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బెంగళూరులో ప్రమాణ స్వీకారానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. సిద్ధరామయ్యతో పాటు ముఖ్యమంత్రి పదవికి బలమైన అభ్యర్థిగా ఉన్న డికె శివకుమార్‌ను డిప్యూటీ సిఎంగా మరియు రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. అయితే 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో 135 సీట్లు…

CINEMA

‘విరూపాక్ష’ హిందీ వెర్షన్ క్లోసింగ్ కలెక్షన్స్.. కనీసం ప్రింటు ఖర్చులను కూడా రాబట్టలేకపోయిందిగా!

ఈ సమ్మర్ లో సాయి ధరమ్ తేజ్ హీరో గా నటించిన ‘విరూపాక్ష’ చిత్రం ప్రేక్షకులకు అద్భుతమైన థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఈ చిత్రం 46 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో మళ్ళీ ఈ రేంజ్ వసూళ్లను చూస్తాడో లేదో తెలియదు కానీ, ఈ చిత్రాన్ని మాత్రం…