News

AP

సీఎం జగన్ – భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన

ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ నెల 3వ తేదీన విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. మే మూడో తేదీన విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అలాగే, చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌ నిర్మాణం, తారక రామ తీర్థ సాగర్ ప్రాజెక్టు పెండింగ్ పనులు ప్రారంభిస్తారు. సవరవిల్లిలో జరిగే బహిరంగ సభ…

AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మరోమారు హైకోర్టులో షాక్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మరోమారు హైకోర్టులో షాక్ కొట్టింది. అదేసమయంలో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సర్వీసు అసోసియేషన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. అసోసియేషన్‌ను ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటీసులను ఉన్నత న్యాయస్థానం సస్పెండ్‌ చేసింది. ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందంటూ ఇటీవల వాణిజ్య పన్నుల శాఖ సర్వీసు అసోసియేషన్‌, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. నిరసనలకు దిగితే ప్రభుత్వం నోటీసులు ఇస్తోందని ఆయన…

APTELANGANA

బాబాయ్ హత్య కేసు నుంచి దృష్టి మరల్చలేరు : టీడీపీ ఎంపీ

సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే టీడీపీ నేతలపై పోలీసులను ఏపీ ప్రభుత్వం ఉసిగొల్పిందని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. ముఖ్యంగా, జగత్ జనని చిట్ ఫండ్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ టీడీపీ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుతో పాటు ఆయన తనయుడు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త శ్రీనివాస్‌(వాసు)లను ఏపీ సీఐడీ అరెస్ట్‌ చేసిందని తెలుగుదేశం పార్టీ ఎంపీ…

National

కేరళ రాష్ట్రంలో ‘ది కేరళ స్టోరీ’ వివాదం

కేరళ రాష్ట్రంలో ‘ది కేరళ స్టోరీ’ వివాదం సాగుతోంది. త్వరలో విడుదలకానున్న ఈ చిత్రంపై పలు వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కూడా ఈ చిత్రంపై స్పందించారు. ఆ చిత్ర పోస్టర్‌ను షేర్ చేసిన ఆయన.. ‘ఇది మీ కేరళ కథ కావొచ్చు. మా కేరళ కథ మాత్రం కాదు’ అంటూ చిత్ర నిర్మాతలను ఉద్దేశించి ఘాటుగా స్పందించారు. కేరళలో కొన్నేళ్లుగా ’32 వేల మంది’ మహిళలు అదృశ్యమైనట్లు వస్తోన్న ఆరోపణలకు సంబంధించి…

TELANGANA

మండు వేసవిలో అకాల వర్షాలు

మండు వేసవిలో అకాల వర్షాలు భయపెడుతున్నాయి. హైదరాబాద్ నగరాన్ని మరోమారు ఈ అకాల వర్షాలు కుమ్మేశాయి. దీంతో నగరం మరోమారు తడిసి ముద్దయింది. ఈ వర్షం కారణంగా రోడ్లపై భారీగా నీరు చేయడంతో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమైంది. ఈదురు గాలులతో అనేక ప్రాంతాల్లో చెట్లు కొమ్మలు విరిగిపడ్డాయి. దీంతో అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా స్తంభించిపోయింది. అకాల వర్షాల సమయంలో నగర వాసులు మరింత అప్రమత్తంగా ఉండాలని గ్రేటర్ హైదరాబాద్ నగర మున్సిపల్ అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా,…

National

కేంద్ర పర్యాటక శాఖామంత్రిగా ఉన్న సికింద్రాబాద్ లోక్‌సభ సభ్యుడు గంగారపు కిషన్ రెడ్డి ఆదివారం స్వల్ప అస్వస్థత

కేంద్ర పర్యాటక శాఖామంత్రిగా ఉన్న సికింద్రాబాద్ లోక్‌సభ సభ్యుడు గంగారపు కిషన్ రెడ్డి ఆదివారం స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. ఛాతిలో నొప్పిగాను, అస్వస్థతగా ఉండటంతో ఆయన్ను హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఎయిమ్స్ వైద్యులు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆయనకు గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నట్టు గుర్తించారు. ఛాతి భాగంలో నొప్పిగా అనిపించడంతో ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో మంత్రి కిషన్ రెడ్డిని ఎయిమ్స్‌లో చేర్పించారు. ఈ క్రమంలో ఆయనకు కార్డియోన్యూరో సెంటర్‌ల పలు రకాలైన…

AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. మే ఒకటో తేదీన ఉమ్మడి గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అలాగే, మే 1, 2 తేదీల్లో ప్రకాశం, కోనసీమ, అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్యసాయి, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మే రెండో తేదీన మన్యం, అల్లూరి సీతారామ రాజు జిల్లా, తూర్పు గోదావరి,…

APTELANGANA

మే ఒకటో తేదీన సిలిండర్ల ధరలను చమురు కంపెనీలు పునఃసమీక్ష

మే ఒకటో తేదీన సిలిండర్ల ధరలను చమురు కంపెనీలు పునఃసమీక్షించాయి. ఇందులోభాగంగా, వ్యాపార అవసరాల నిమిత్తం వినియోగించే వాణిజ్య సిలిండర్ ధర తగ్గింది 19 కేజీల సిలిండర్ ధరను రూ.171.50 మేరకు తగ్గించినట్టు ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు సోమవారం వెల్లడించాయి. ఈ సవరణ తర్వాత 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర దేశ రాజధాని ఢిల్లీలో రూ.1856.50కు చేరుకుంది. ఈ తగ్గిన ధర సోమవారం నుంచే అమల్లోకి వచ్చింది. అలాగే, ముంబైలో రూ.1808.50గాను కోల్‌కతాలో రూ.1960.50కు…

TELANGANA

అల్లదుర్గ్ మెదక్ జిల్లా ప్రతినిది :అల్లదుర్గ్ గ్రామం లోని యస్సి కాలనీ లో కుల నిర్ములన పై అవగాహనా సదస్సు

అల్లదుర్గ్ మెదక్ జిల్లా ప్రతినిది :అల్లదుర్గ్ గ్రామం లోని యస్సి కాలనీ లో కుల నిర్ములన పై అవగాహనా సదస్సు Si ప్రవీణ్ రెడ్డి నిర్వహించడం జరిగింది ఇందులోని బాగంగా కాలనీ వాసులు అనేక సంకెలో అజర్ కావడం మరియు యస్సి నాయకులు బి బలరాం బి రాఘవేంద్ర బి బాలయ్య బి సాయిలు టీ అశోక్ పోలీస్ బృందం పాల్గున్నారు

CINEMA

అఖిల్ పై అలా అభిమానాన్ని చాటుకున్న సమంత..

స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న సమంత.. 2017లో నాగచైతన్యను వివాహం చేసుకుని అక్కినేని వారి ఇంటికి కోడలు అయ్యింది. అయితే ఆ ట్యాగ్ ను ఎక్కువ కాలం ఉంచుకోలేకపోయింది. పెళ్లై నాలుగేళ్లు గడవకముందే నాగచైతన్యతో విడిపోయి అక్కినేని కుటుంబంతో తెగదెంపులు చేసుకుంది.   అయితే చైతుతో విడిపోయిన సరే అక్కినేని అఖిల్ తో మాత్రం ఆమె మొదటి నుండి స్నేహపూర్వకంగా ఉంటూ వస్తుంది. సమంతకు ఆరోగ్యం బాగోలేనప్పుడు అక్కినేని కుటుంబం నుండి తొందరగా కోలుకోవాలని…