News

World

గుంజీలు తీస్తే ఫ్రీ బస్ టికెట్.

చిన్నప్పుడు తప్పు చేస్తే టీచర్లు గుంజీలు తీయించిన చిన్న నాటి జ్ఞాపకాలు ఎంత మందికి గుర్తున్నాయి. అప్పుడు తప్పు చేస్తే టీచర్లు శిక్ష కింద గుంజీలు తీయించే వాళ్లు. కానీ ఇప్పుడు అవే గుంజీలు తీస్తే ఫ్రీగా టికెట్ పొందేలా ఓ దగ్గర బంపర్ ఆఫర్ పెట్టేశారు. ప్రభుత్వమే ఇలా ఉచితంగా టికెట్ ఇవ్వడానికి గుంజీలు తీయాలని చెబుతోంది. అసలు ఎక్కడ ఈ ఆఫర్ ఉంది, ఎన్ని గుంజీలు తీయాలో తెలుసుకుందాం. యూరప్ లోని రొమానియాలో ఈ…

CINEMA

పవర్ స్టార్ సినిమాకు నో చెప్పి బాధపడుతున్న బుట్టబొమ్మ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan), ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో `భవదీయుడు భగత్‌సింగ్‌` అనే మూవీని గతంలో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో బుట్టబొమ్మ పూజా హెగ్డేను హీరోయిన్ గా ఎంపిక అయింది. పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను సైతం విడుదల చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితం కావాల్సి ఉన్న ఈ చిత్రం `హరి హర వీరమల్లు` అనంతరం సెట్స్‌ మీదకు వెళుతుందని అందరూ భావించారు.…

National

భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ డీవై చంద్రచూడ్ (Justice DY Chandrachud) నేతృత్వంలోని కొలీజియం సిఫారసు

సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలంటూ ఐదుగురి పేర్లను భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ డీవై చంద్రచూడ్ (Justice DY Chandrachud) నేతృత్వంలోని కొలీజియం సిఫారసు చేసింది. హైకోర్టు జడ్జిలుగా ఉన్న జస్టిస్ పంకజ్ మిథల్, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్, జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ మనోజ్ మిశ్రాలను సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది కొలీజియం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ అధ్యక్షతన ఆరుగురు న్యాయమూర్తులతో కూడిన…

TELANGANA

కరీంనగర్ లో బీజేపీ భారీ బహిరంగ సభ..

స్వచ్ఛందంగా వెళ్లేందుకు సిద్ధమైన వేలాది యువత, హిందుత్వ అభిమానులు సభ సక్సెస్ తో బీఆర్ఎస్ పతనానికి కరీంనగరే నాంది కాబోతోందనే సంకేతాలు పంపనున్న బీజేపీ. మొత్తం 56 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర పూర్తి. కరీంనగర్ బహిరంగ సభలో 6వ విడత ప్రజా సంగ్రామ యాత్ర షెడ్యూల్ ప్రకటించే అవకాశం . బీజేపీ ప్రభుత్వమేననే సంకేతాలు పంపడమే రాబోయేది బండి లక్ష్యం. స్వచ్ఛందంగా ప్రజలు తరలిరావాలని సంజయుడి పిలుపు .రేపటితో 1400 కి.మీలు పాదయాత్ర చేసిన బండి సంజయ్.…

Technology

వాట్సాప్ న్యూ ఫీచర్ .. ఇక నుంచి ఒకసారి మాత్రమే మెస్సేజ్ చూడటానికి వీలు కల్పించేలా కొత్త ఫీచర్

ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ వాట్సప్ అంటే తెలియని వారు అసలు ఎవరూ ఉండరు. స్మార్ట్‌ఫోన్ కలిగి ఉన్న ప్రతిఒక్కరూ తప్పనిసరిగా వాట్సప్ ఉపయోగిస్తూ ఉంటారు. వాట్సప్ లో ఎక్కువ సమయం గడిపేవారు చాలామందే ఉంటారు. పొద్దున్నే లేవగానే వాట్సప్, రాత్రి నిద్రపోయే ముందు వాట్సప్ లో మెస్సేజ్ లు చెక్ చేసుకునేవాళ్లు ఎందరో. ఫ్రెండ్స్ తో ఛాటింగ్, స్టేటస్ లు, డాక్యుమెంట్స్ కు వాట్సప్ ఎంతో ఉపయోగపడుతుంది. ఏదైనా డ్యాకుమెంట్ పంపించుకోవాలన్నా, ఫ్రెండ్స్ తో…

POLITICSTELANGANA

తెలంగాణ కాంగ్రెస్‌ (Congress)కు మరో ఝలక్‌

తెలంగాణ కాంగ్రెస్‌ (Congress)కు మరో ఝలక్‌ తగలనుంది. దివంగత నేత పి.జనార్థన్‌రెడ్డి కుమారుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌ రెడ్డి కాంగ్రెస్‌ (Congress) పార్టీని వీడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఆయన కాంగ్రెస్‌ను వీడి BJP తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఈనెల 28న PJR వర్ధంతి తర్వాత ఆయన కమలం గూటికి చేరనున్నట్లు పొలిటికల్‌ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌కు మరో దెబ్బ తగలనుంది. మరో కీలక నేత కాంగ్రెస్ పార్టీని వీడనున్నట్లు ప్రచారం జరుగుతోంది.…

AP

జగన్మోహన్ రెడ్డి తప్పు తెలుసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్

పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(PAC)చైర్మన్ పయ్యావుల కేశవ్ కు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కళ్లెం వేశారు. సక్రమంగా సమావేశాలను(Meetings) నిర్వహించుకోవడానికి అనువుగా లేకుండా పరిస్థితులను మార్చేశారు. దీంతో ప్రభుత్వంలో ఏమి జరుగుతుందో రహస్యంగా ఉంచుతున్నారు. పీఏసీ(PAC) చైర్మన్ గా టీడీపీ సీనియర్ లీడర్ పయ్యావుల కేశవ్ బాధ్యతలు స్వీకరించిన తరువాత జగన్ సర్కార్ లోని అతి పెద్ద తప్పును బయటకు తీశారు. సుమారు రూ. 25వేల కోట్ల విలువైన సమాచారం గల్లంతైన అంశాన్ని బయట పెట్టారు. ఆ…

CINEMA

వల్తేరు వీరయ్యకు దాదాపుగా రూ. 6.5 కోట్లు …మాస్ మహారాజా రవితేజ

మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi), డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో `వాల్తేరు వీరయ్య` అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మాస్ మహారాజా రవితేజ ఒక కీలక పాత్రను పోషిస్తున్నారు. అలాగే శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంటే.. కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. విశాఖపట్టణం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మాస్ ఎంటర్టైనర్ లో మత్స్య కారుల నాయకుడు వీరయ్యగా చిరంజీవి కనిపించనున్నాడు. మైత్రీ మూవీ…

National

గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ రెండోసారి ప్రమాణ స్వీకారం

: గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. వరుసగా రెండోసారి సీఎం బాధ్యతలను చేపట్టారు. గాంధీనగర్‌లోని కొత్త సెక్రటేరియట్ హెలీప్యాడ్ గ్రౌండ్‍లో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర 18 ముఖ్యమంత్రిగా భూపేంద్రతో గవర్నర్ ఆచార్య దేవ్‍వ్రత్ ప్రమాణం చేయించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలు, ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 16 మంది ఎమ్మెల్యేలు ఈ వేదికపైనే మంత్రులుగా…

National

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సీనియర్ ఐఏఎస్ అనురాగ్ శ్రీవాస్తవని ముగ్గురు వ్యక్తులు బ్లాక్ మెయిల్‌

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సీనియర్ ఐఏఎస్ అనురాగ్ శ్రీవాస్తవని ముగ్గురు వ్యక్తులు బ్లాక్ మెయిల్‌కు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బ్యాంక్‌ కార్డును క్లోనింగ్ చేసి ఆయన ఖాతా నుంచి రూ.50,00 డ్రా చేసినందుకు ముగ్గురు వ్యక్తులను ఉత్తరప్రదేశ్ పోలీసుల సైబర్ బృందం అరెస్టు చేసింది. ఐఏఎస్ అధికారి శ్రీవాస్తవ ఈమెయిల్‌ను హ్యాక్ చేసి బ్లాక్ మెయిల్ చేశారని పోలీసులు తెలిపారు. అరెస్టయిన ముగ్గురిని అమిత్ ప్రతాప్ సింగ్, హార్దిక్ ఖన్నా, రజనీష్ నిగమ్ గా గుర్తించారు. ముగ్గురూ అనురాగ్…