News

National

రూ. 19వేల కోట్లకు రక్షణరంగ ఉత్పత్తుల ఎగుమతుల విలువ

రక్షణరంగ ఉత్పత్తుల ఎగుమతుల విషయంలో భారత దేశం కొత్త రికార్డులు సృష్టిస్తోంది. 2021-22లో ఎన్నడూ లేని విధంగా రక్షణరంగ ఉత్పత్తుల ఎగుమతుల విలువ రూ. 14వేల కోట్లుగా నమోదైంది. ఈ విషయాన్ని రక్షణశాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ వెల్లడించారు. మిలిటరీ హార్డ్​వేర్​ను మిత్రపక్షాలకు ఎగుమతి చేసే విషయంలో ప్రభుత్వం చేపట్టిన సరళమైన విధానాల వల్ల ఈ రికార్డు సాధ్యమైందని అన్నారు. రక్షణరంగ ఉత్పత్తుల ఎగుమతులు.. 2014లో కేవలం రూ. 900కోట్లుగా ఉండేవని, ఇప్పుడు రూ. 14వేల కోట్లకు…

TELANGANA

రాష్ట్ర పోలీసు శాఖలో కొత్త పోస్టుల భర్తీకి తెలంగాణ మంత్రివర్గం ఆమోదం

రాష్ట్ర పోలీసు శాఖలో కొత్త పోస్టుల భర్తీకి తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. శాంతిభద్రతల పరిరక్షణలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రంలో పోలీసు శాఖను మరింత హైదరాబాద్ : రాష్ట్ర పోలీసు శాఖలో కొత్త పోస్టుల భర్తీకి తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. శాంతిభద్రతల పరిరక్షణలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రంలో పోలీసు శాఖను మరింత పటిష్టం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. పెరుగుతున్న సాంకేతికత, మారుతున్న సామాజిక పరిస్థితులలో, నేరాల తీరు కూడా మారుతున్న…

CINEMA

రూ. 50 లక్షల రెమ్యునరేషన్ తగ్గించుకోడానికి రెడీ..LIGER BATCH

జీవితం ఎవ్వరినీ వదిలిపెట్టదు, అందరి సరదా తీర్చేస్తది. టెంపర్ సినిమాలో పూరీ రాసిన డైలాగిది. సరిగ్గా గమనిస్తే కొన్ని రోజులుగా పూరీని, లైగర్ టీములో ఎవ్వరినీ వదిలిపెట్టకుండా అందరి సరదా తీర్చేస్తుంది దరిద్రం. ప్యాన్ ఇండియా మూవీగా ఆగస్ట్ 25న లైగర్ విడుదలైనా, ఆ మూవీ కష్టాల్లోంచి మాత్రం ఇప్పట్లో విడుదలయ్యేలా లేరెవరూ. సినిమా ఫైనాన్సుకు సంబంధించి ఇప్పటికే పూరీ, ఛార్మీలతో పాటు హీరో విజయ్ దేవరకొండని కూడా ఈడీ దర్యాప్తు చేసిన విషయం తెలిసిందే. హీరో,…

TELANGANA

విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను పంపిణీ

వరుస ఘటనలతో బాసర (Basara) ఐఐఐటీ నిత్యం వార్తలో నిలుస్తోంది. దీంతో తెలంగాణ మంత్రి కేటీఆర్ (KTR) మరోసారి బాసర సమస్యలపై ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో క్యాంపస్‌లో ఇటీవల జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలపై ఐఐఐటీ బాసర అధికారులపై మండిపడ్డారు. ఇవాళ బాసర ఐఐఐటీ కాన్వొకేషన్‌లో మంత్రి కేటీఆర్ (KTR), విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అధికారులతో మాట్లాడిన మంత్రి కేటీఆర్.. ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై ఐఐఐటీ అధికారులపై మండిపడ్డారు. మెస్ కాంట్రాక్టర్లను…

National

దేశంలోని అనేక రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు తగ్గుముఖం

గత మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని.. తెలంగాణలో తగ్గుముఖం పట్టాయని కేంద్ర వ్యవసాయశాఖ పార్లమెంట్‌లో తెలిపింది. 2019 నుంచి 2021 వరకు తెలుగు రాష్ట్రాల్లో 2,982 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ రాజ్యసభలో వెల్లడించారు. 2021 జాతీయ నేర రికార్డుల బ్యూరో ఇచ్చిన నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 1,673 మంది రైతులు మృత్యువాత పడగా, తెలంగాణలో 1,309 మంది తనువు చాలించినట్టు కేంద్రం పేర్కొంది. దేశంలో అత్యధికంగా రైతులు…

CINEMA

సమంత మీద పగ సాదించడానికే ఆ పని చేస్తున్న naga chaitanya..!!

సమంత-నాగచైతన్య ఎంతో గాఢంగా ప్రేమించుకుని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకున్నా వాళ్లని ఒప్పించి మరీ అంగరంగ వైభవంగా పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లయ్యాక నాలుగు సంవత్సరాల పాటు ఎంతో అన్యోన్యంగా చాలా ప్రేమగా ఉండేవారు. అంతేకాదు చాలామంది సినీ సెలబ్రిటీలకు ఈ జంట అంటే కొంచెం అసూయ కూడా ఉండేది. అలా ఉండేది వీరి జంట. ఇక అలాంటి ఈ దంపతులకు ఎవరి దిష్టి తగిలిందో ఏమో కానీ అనూహ్యంగా విడాకులు తీసుకుంటున్నామంటూ సోషల్ మీడియా…

CINEMA

పాన్ ఇండియా స్థాయిలో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న యశ్‌కు.. ఈరోజు వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే

కన్నడ స్టార్ యశ్(kannada star yash) గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. యష్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా కన్నడ సినీ పరిశ్రమంలో అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హీరోగా ఎదిగిన యశ్.. ప్రశాంత్‌ నీల్ తెరకెక్కించిన `కేజీఎఫ్` సినిమాతో `రాఖి భాయ్` గా ప్రేక్షకుల మనసులో చెదిరిపోని ముద్ర వేసుకున్నాడు. ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న యశ్‌కు.. ఈరోజు…

World

ఇండోనేషియాలో విషాద ఘటన

ఇండోనేషియాలో విషాద ఘటన వెలుగు చూసింది. ఓ బొగ్గు గనిలో సంభవించిన పేలుడు ఘటనలో పది మంది కార్మికులు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదం ఇండోనేషియాలోని వెస్ట్ సుమత్ర ఫ్రావిన్స్ లో జరిగింది. మిథేన్ గ్యాస్ లీక్ అవ్వటంతోనే ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో పది మంది మృతదేహాలను గుర్తించినట్లు ఓ అధికారి చెప్పారు. మరో నలుగురికి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనిపై ఆ దేశ అధికారులు…

TELANGANA

ఆదిభట్ల కిడ్నాప్ నిందితుల అరెస్ట్…కథ సుఖాంతం.

రంగారెడ్డిజిల్లా ఆదిభట్లలో కలకలం సృష్టించిన యువతి కిడ్నాప్‌ కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. యువతిని సేఫ్‌గా రక్షించారు. పదిగంటలకు పైగా యువతి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబసభ్యులు, బంధువుల ఆందోళనలతో ఆదిభట్ల అట్టుడుకింది. అయితే తాను మన్నెగూడలోనే ఉన్నట్టు బాధిత యువతి తన తండ్రి దామోదర్‌కు ఫోన్‌ చేసి చెప్పడంతో కిడ్నాప్‌ కథ సుఖాంతమైంది. లొకేషన్‌ ఆధారంగా స్పాట్‌ చేరుకున్న పోలీసులు బాధిత యువతిని సేఫ్‌గా రక్షించారు. కిడ్నాపర్ నవీన్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. యువతి కిడ్నాప్‌ వెనుక ప్రేమ…

National

అసెంబ్లీలో విపక్షనేతగా ఉన్న ముఖేష్ అగ్నిహోత్రి సీఎం సీటు

అదృష్టమో, ఆనవాయితీయో.. హిమాచల్ ప్రదేశ్‌ను గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీ. కానీ కథ మాత్రం మొదటికే వచ్చింది. సీఎం పదవి కోసం నేతల మధ్య రగడ రాజకుంది. ఓవైపు ఎమ్మెల్యేలు జారిపోతారేమో అనే భయాలు హైకమాండ్‌ను వెంటాతుంటే.. మరోవైపు సిమ్లాలో సీఎం కుర్చీ కోసం లడాయి చెలరేగింది. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు కష్టాలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి పీఠం కోసం నేతలు తన్నుకు చస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. హిమాచల్ పీసీసీ చీఫ్ ప్రతిభా సింగ్‌,…