ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం ఏనాడూ బాగుపడలేదు: హరీశ్ రావు..
తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుండగా, ఈ అంశం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. యూరియా కోసం రైతులు అధికారుల కాళ్లు పట్టుకునే దుస్థితి రావడంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే అన్నదాతలకు ఈ కష్టాలు తప్పడం లేదని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో దర్జాగా బతికిన రైతు.. నేడు కాంగ్రెస్ పాలనలో యూరియా కోసం…

