AP

AP

సంక్రాంతి పండుగ వేళ శుభవార్త ; ఏపీ హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ సమయంలో ఏపీ హైకోర్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. రాష్ట్ర జ్యుడీషియల్‌ సర్వీసెస్‌లో భాగంగా 39 సివిల్‌ జడ్జి పోస్టుల(జూనియర్‌ డివిజన్‌)ను భర్తీ చేయటం కోసం నోటిఫికేషన్ జారీ అయ్యింది.   సివిల్‌ జడ్జి పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు జనవరి 31వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్య వివరాలు చూస్తే 39 పోస్టులు…

AP

వైసీపీకి ఎంపీ బాలశౌరి రాజీనామా.. జనసేనలోకి ఎంట్రీ ఖరారు..!

అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని మరో కీలక నేత గుడ్‌బై చెప్పారు. మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి వైయస్సార్సీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపినట్లు ఎంపీ బాలశౌరి తెలిపారు. తనకు రెండోసారి పోటీకి వైసీపీ అవకాశం ఇవ్వడం లేదన్న సమాచారంతో మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.   తనకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని అసంతృప్తితో ఉన్న బాలశౌరి గత కొంత కాలంగా పార్టీ…

AP

టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ఖరార్..డజను హామీలు

సార్వత్రిక ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పలు లోక్‌సభ/అసెంబ్లీ స్థానాలకు కొత్త ఇన్‌‌ఛార్జీలను ప్రకటిస్తూ దూకుడు మీద ఉంది.   పలు అంశాలు..   సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపికపై తెలుగుదేశం- జనసేన పార్టీలు సాగిస్తోన్న కసరత్తు కూడా దాదాపుగా ముగింపుదశకు చేరుకుంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తరువాతే ఈ జాబితాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నాయి. దీనికి సమాంతరంగా-…

AP

చంద్రబాబు ఇంటికి షర్మిల- దశాబ్దాల వైరంలో బిగ్ టర్న్..!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒకప్పుడు స్నేహితులుగా, ఆ తర్వాత రాజకీయ ప్రత్యర్ధులుగా హోరాహోరీగా తలపడిన వైఎస్, చంద్రబాబు ఎపిసోడ్ కు హెలికాఫ్టర్ ప్రమాదం తర్వాత తెరపడింది. దీనికి ముందు వైఎస్, చంద్రబాబు అసెంబ్లీ వేదికగా, బయటా చేసుకున్న విమర్శలు, టార్గెట్ చేసుకున్న తీరు ఏపీ రాజకీయాల్ని ఓ రేంజ్ లో వేడెక్కించేసింది. విభజన తర్వాత ఇప్పటికీ అసెంబ్లీలో వైఎస్, చంద్రబాబు స్ధాయి పోరు అధికార, విపక్షాల మధ్య కనిపించడం లేదంటే అతిశయోక్తి కాదు.   అలా గతంలో…

AP

రెబెల్ ఎంపీ రఘురామకు మరో షాక్..

ఏపీలో సంక్రాంతి వేళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటివరకు ఢిల్లీ హైదరాబాద్ కేంద్రంగా తన కార్యకలాపాలు నిర్వహిస్తూ ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వస్తున్నారు వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు. గతంలో రఘురామ కృష్ణం రాజును ఏపీ పోలీసులు సైతం అరెస్టు చేసి విచారణ చేసిన సంగతి తెలిసిందే. అయితే సంక్రాంతి సందర్భంగా తన సొంతూరికి రావాలని భావిస్తున్న రఘురామ కృష్ణంరాజుపై ఏపీ పోలీసులు నిఘా పెట్టినట్లు సమాచారం. తనను ఓ అట్రాసిటీ కేసులో అరెస్టు…

AP

జగన్ సర్కార్ కు ఈసీ భారీ షాక్..!

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఈసీ వైసీపీ ప్రభుత్వానికి భారీ షాకిచ్చింది. ఇప్పటికే రాష్ట్రంలో ఓటర్ల జాబితా తయారీలో అధికారులు అధికార పార్టీ మాట విని అక్రమాలకు పాల్పడుతున్నట్లు నిర్ధారణకు వచ్చిన ఈసీ.. విజయవాడలో నిర్వహించిన సమీక్షలో అక్షింతలు వేసింది. తటస్ధంగా ఉంటారా లేదా అని ప్రశ్నించింది. దీంతో కలెక్టర్లు, ఎస్పీలు ఇరుకునపడ్డారు. దీనికి కొనసాగింపుగా ఇవాళ ఈసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.   రాష్ట్రంలో ఎన్నికల విధులకు వైసీపీ ప్రభుత్వం సచివాలయాల సిబ్బందిని బీఆల్వోలు,…

AP

వైసీపీ మూడో జాబితా..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనడానికి సన్నద్ధమౌతోంది. ఇందులో భాగంగా రెండు విడతల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది. మొత్తంగా 38 మంది కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించింది.   ఇందులో సామాజిక సాధికారత కల్పించారు వైఎస్ జగన్. మహిళలు, యువతకు పెద్ద పీట వేశారు. కొన్నిచోట్ల కొత్తవారికి అవకాశం ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు తగిన ప్రాధాన్యతను కల్పించారు. సామాజిక సాధికారతే…

AP

టీడీపీతో పొత్తు చర్చల వేళ బీజేపీ అనూహ్య నిర్ణయం..!!

ఏపీలో ఎన్నికల రాజకీయంలో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. జగన్ సింగిల్ గానే 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. టీడీపీ, జనసేన పొత్తుతో రంగంలోకి దిగుతున్నాయి. బీజేపీ కలిసి వస్తుందనే భావిస్తున్నాయి. ఏపీలో తిరిగి బలం పెంచుకొనేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఈ సమయంలో బీజేపీ-టీడీపీ పొత్తు వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో పొత్తు ఉంటుందా లేదా అనే చర్చ మొదలైంది.   మారుతున్న లెక్కలు : ఏపీలో పొత్తు ఖాయం చేసుకున్న…

AP

అందుకే పవన్ కళ్యాణ్‌ను కలిసా: అంబటి రాయుడు..

టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయాల్లోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అనాలోచిత నిర్ణయాలు.. ముక్కుసూటితనంతో క్రికెట్‌లో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న అంబటి రాయుడు.. రాజకీయాల్లోనూ అదే తరహా శైలితో దూకుడు కనబరుస్తున్నారు.   ఇటీవలే ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీ పార్టీలో చేరిన రాయుడు.. 10 రోజుల్లోనే ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తాను ఆశించిన సీటు దక్కలేదని, దాంతోనే పార్టీ నుంచి తప్పుకున్నాడని ప్రచారం జరగ్గా.. రాయుడు మాత్రం…

AP

వైసీపీది దొడ్డిదారి.. ఈసీకి చంద్రబాబు, పవన్ ఫిర్యాదు..

గత కొద్దిరోజులుగా ఓటర్ల జాబితా పై పెద్ద రగడ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రత్యర్థి పార్టీలకు సంబంధించి సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారంటూ విపక్షాల నుంచి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులను అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున ఓట్లను తొలగిస్తున్నారంటూ ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. ఇప్పుడు రాష్ట్రానికి వచ్చిన అధికారులకు ఇదే అంశంపై విపక్ష నేతలు ఫిర్యాదు చేయడం విశేషం.ముఖ్యంగా మార్పులు, చేర్పుల్లో అవకతవకలు…