పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయంలో కలకలం: లోపలికి చొరబడి కాన్వాయ్ వాహనాలను ధ్వంసం చేసిన వ్యక్తి!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారి మంగళగిరి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చెందిన నీలాద్రి అనే వ్యక్తి ఆటోలో నేరుగా కార్యాలయంలోకి చొరబడి వీరంగం సృష్టించాడు. సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగి, అక్కడే ఉన్న కర్రతో పవన్ కల్యాణ్ కాన్వాయ్‌లోని రెండు వాహనాల అద్దాలను పగులగొట్టి ధ్వంసం చేశాడు. వెంటనే అప్రమత్తమైన జనసేన కార్యాలయ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల ప్రాథమిక…

