అంగన్వాడి వర్కర్లకు గ్రాట్యుటీ అమలు చేయాలి… రిలే నిరాహార దీక్షలో గోవిందమ్మ, మేరీ డిమాండ్..
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం అంగన్వాడి వర్కర్లకు తక్షణమే గ్రాట్యుటీ అమలు చేయాలని రాయదుర్గం ఐసీడీఎస్ ప్రాజెక్టు అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షురాలు గోవిందమ్మ, కార్యదర్శి మేరీ డిమాండ్ చేశారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన రెండు రోజుల రిలే నిరాహార దీక్షలో భాగంగా రాయదుర్గం ప్రాజెక్టు కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడి వర్కర్లు నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, అంగన్వాడి వర్కర్లు ఎన్నో సంవత్సరాలుగా తక్కువ వేతనాలతో సేవలందిస్తున్నప్పటికీ…

