రవాణా శాఖలో అనవసర నిబంధనలు తొలగించండి: సీఎం చంద్రబాబు..
రవాణా శాఖలో అనవసర నిబంధనలను తక్షణమే తొలగించాలని, టెక్నాలజీని పూర్తిస్థాయిలో ఉపయోగించి ప్రజలకు సులభతరమైన, అవినీతి రహిత సేవలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ సెంటర్లో సోమవారం వివిధ శాఖల పనితీరుపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రవాణా శాఖలో చేపట్టాల్సిన సంస్కరణలపై సీఎం కీలక సూచనలు చేశారు.రవాణా శాఖలో సంస్కరణలకు తీసుకుంటున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 24 గంటల్లో డీమ్డ్ రిజిస్ట్రేషన్ విధానం, ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్స్…

