ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ పకడ్బందీగా ఉండాలి: మంత్రి నారా లోకేశ్..
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఎలాంటి న్యాయపరమైన, సాంకేతిక సమస్యలు తలెత్తకుండా పకడ్బందీగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అధికారులను స్పష్టంగా ఆదేశించారు. జాబ్ కేలండర్-2026 అమలుపై ఆయన అధ్యక్షతన ఏర్పాటైన మంత్రుల బృందం బుధవారం ఉండవల్లిలోని ఆయన నివాసంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. ఈ సమావేశానికి పలువురు మంత్రులు ఆన్లైన్ ద్వారా హాజరు కాగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా కీలక అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని వివిధ…

