రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు..! ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో భేటీ..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ఆయన సాగిస్తున్న ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి సి.ఆర్. పాటిల్‌తో జరిగే సమావేశాల్లో రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, విభజన హామీల అమలుపై ప్రధానంగా చర్చించనున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వేగం పెంచడం, కొత్తగా నిధుల విడుదలపై కేంద్రం నుంచి స్పష్టమైన…

