నారా చంద్రబాబు పిటిషన్‌పై విచారణ.. వైదొలిగిన న్యాయమూర్తి!
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై విచారణ నుంచి న్యాయమూర్తి వైదొలిగారు. ఈ పిటిషన్ దసరా పండగ సెలవుల ప్రత్యేక బెంచ్ (వెకేషన్ బెంచ్) ముందు విచారణకు రాగా.. ‘నాట్ బిఫోర్ మీ’ అంటూ న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప విచారణ నుంచి తప్పుకున్నారు. వ్యక్తిగత కారణాలతో విచారణ చేపట్టలేనని స్పష్టం చేశారు. ఎవరు విచారించాలన్నది హైకోర్టు రిజిస్ట్రార్ నిర్ణయిస్తారని తెలిపారు.…

