AP

AP

స్కిల్ స్కామ్‌లో కిలారి రాజేష్‌ కీ రోల్..

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సాయంత్రం ఢిల్లీలో అడుగు పెట్టారు. రెండు రోజుల పాటు ఆయన దేశ రాజధానిలో ఉండనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్‌తో భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, ఇతర అంశాలపై చర్చించనున్నారు. జగన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో- దీనిపై తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారాన్ని మొదలు పెట్టింది. తన కేసులను మాఫీ చేయించుకోవడానికి జగన్…

APNational

రూపాయి పావలా ప్రభుత్వం; చచ్చు తెలివితేటలు, కులరాజకీయాలు: భగ్గుమన్న పవన్ కళ్యాణ్!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్రలో భాగంగా కృష్ణాజిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో నేడు పెడనలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కొనసాగింది. ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ది రూపాయి పావలా ప్రభుత్వమని పవన్ కళ్యాణ్ విమర్శించారు. కేవలం ఓట్ల కోసమే వైసీపీ పథకాలను తీసుకొస్తుందని, అమలుకు వచ్చేసరికి అంతా డొల్లతనం మాత్రమే కనిపిస్తుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వైసిపిని గద్దె దించడం…

AP

ఏపీలో ఎన్నికల అక్రమాల విషయంలో గతంలో వైసీపీ సర్కార్ తో హోరాహోరీ

ఏపీలో ఎన్నికల అక్రమాల విషయంలో గతంలో వైసీపీ సర్కార్ తో హోరాహోరీ పోరాడి, అనంతరం స్ధానిక ఎన్నికల్లో తన పంతం నెగ్గించుకుని మరీ రిటైర్ అయిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ రీఎంట్రీ ఇచ్చారు. తాజాగా ఏపీలో సిటిజెన్స్ ఫర్ డెమోక్రసీ పేరుతో ఏర్పాటైన ఓ స్వచ్చంద సంస్ధ తరఫున రీఎంట్రీ ఇచ్చిన నిమ్మగడ్డ తిరిగి ఎన్నికల అక్రమాలపై పోరాటం ప్రారంభించారు. ఇందులో భాగంగా ఇవాళ ఎన్నికల ప్రధానాధికారికి నకిలీ ఓట్లపై ఫిర్యాదు చేశారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ…

AP

మాజీ మంత్రి టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మంత్రి రోజా కన్నీటి పర్యంతమయ్యారు.

మాజీ మంత్రి టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మంత్రి రోజా కన్నీటి పర్యంతమయ్యారు. తెలుగుదేశం పార్టీలో నచ్చక తాను బయటకు వచ్చానని, ప్రస్తుతం కూడా తనను టార్చర్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడిన రోజు మహిళా నేతలు బండారు వ్యాఖ్యలను స్వాగతిస్తున్నారు. మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులను ఎవరైనా ఇలా మాట్లాడితే ఊరుకుంటారా? అంటూ ప్రశ్నించారు. లోకేష్ నీ తల్లి గురించి మాట్లాడితే ఊరుకుంటావా?…

APTELANGANA

ఏపీ, తెలంగాణల్లో కలకలం

అమరావతి: ఏపీ, తెలంగాణల్లో కలకలం చోటు చేసుకుంది. జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు రంగంలోకి దిగారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సోదాలకు పూనుకున్నారు. ఈ తెల్లవారు జాము నుంచీ ఈ సోదాలు కొనసాగుతున్నాయి. పలు నివాసాలపై మెరుపు దాడులు చేపట్టాయి. వామపక్ష తీవ్రవాద భావజాలం ఉన్న వారు ఆయా ప్రాంతాల్లో నివసిస్తోన్నట్లు పక్కా సమాచారం అందడంతో ఎన్ఐఏ అధికారులు ఈ తనిఖీలు చేస్తోన్నారు. ఏపీ, తెలంగాణల్లో ఏకకాలంలో 60 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతుండటం…

AP

ఏపీలో దసరా సెలవులపై నెలకొన్న ఉత్కంఠకు ప్రభుత్వం ఎట్టకేలకు తెర

ఏపీలో దసరా సెలవులపై నెలకొన్న ఉత్కంఠకు ప్రభుత్వం ఎట్టకేలకు తెరదించింది.ఈసారి దసరా సెలవులపై తాజాగా పలు తేదీలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం కోసం విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం కాకుండా సెలవుల్ని మార్చి ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో విద్యార్ధులు, టీచర్లు, తల్లితండ్రుల్లో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇవాళ స్పష్టమైన ప్రకటన చేసింది. ఏపీలో అన్ని పాఠశాలలకు అక్టోబర్ 14 నుంచి 24 వరకూ సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం…

AP

ఏపీలో టీడీపీ నేతల చుట్టూ కేసుల ఉచ్చు

ఏపీలో టీడీపీ నేతల చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తోంది. మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఈ నెల 4న విచారణకు రావాలని సీఐడీ నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో నారాయణ హైకోర్టులో ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసారు. ఈ సమయంలోనే సీఐడీ నోటీసులు జారీ చేసింది. లోకేశ్ ను విచారణకు పిలిచిన సమయంలోనే ఇప్పుడు సీఐడీ నారాయణకు నోటీసులు ఇచ్చింది. అమరావతి ఇన్నర్…

APNational

కాబోయే భర్తతో వెళ్లిన యువతి, గస్తీ పోలీసులు ఏం చేశారంటే ?, కొన్ని గంటలు !

న్యూఢిల్లీ/లక్నో: కాబోయే భార్యను ఓ యువకుడు (lovers) బయట తిప్పుతున్నాడు. ఇదే సమయంలో ఏకాంతంగా వెలుతున్న జంటను ముగ్గురు వ్యక్తులు అడ్డుకుని కొన్ని గంటల పాటు చిత్రహింసలకు గురిచేశారు. యవతిని కొన్ని గంటల పాటు లైంగిక వేధింపులకు గురి చేశారు. ఇద్దరిని వదిలిపెట్టాలంటే భారీ మొత్తంలో డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరికి పోలీసుల విచారణలో యువతిని వేధింపులకు గురి చేసిన ముగ్గురిలో ఇద్దరు పోలీసులు ఉన్నారని వెలుగు చూడటం కలకలం రేపింది. హీరో సల్మాన్ ఖాన్…

APNationalTELANGANA

తెలంగాణలోని ఈ ఆలయంలో గాంధీజీ పాలరాతి విగ్రహం…

నేడు మహాత్మాగాంధీ పుట్టినరోజు…మన దేశానికి స్వేచ్ఛావాయుువులను అందించడానికి జాతిపతి మహాత్మ గాంధీ కీలక పాత్ర పోషించాడు. భారతదేశంలో చాలామంది గాంధీజీని దేవునిగా కొలుస్తారు. అంతేకాకుండా, దేశంలో ఏకంగా ఆయనకు ప్రత్యేకించి దేవాలయాలు కూడా ఉన్నాయి. అయితే, దేశంలో గాంధీజీ ఆలయాలు ఎన్నో ఉన్నప్పటికీ, తెలంగాణలో ఉన్న ఈ ఆలయం ఎంతో ప్రత్యేకం. ఈ ఆలయంలోని గాంధీజీ విగ్రహం పాలరాతితో నిర్మించారు. రండి. ఈ సందర్భంగా కోరిన కోర్కెలు తీర్చే గాంధీ ఆలయం గురించి గాంధీ జయంతి నాడు…

AP

తెలుగుదేశం పార్టీలో త్వరలో చీలిక..?!

అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు. ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ విధించింది. జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది. 2014-2019 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని, డొల్ల కంపెనీలను సృష్టించి, ముడుపులను పొందారనే ఆరోపణలు చంద్రబాబుపై ఉన్నాయి. దీనిపై ఏపీ…