AP

AP

పులివెందులలో రైతుల డబ్బుతో రోడ్ల మరమ్మతులు..

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో అధికార పార్టీ పాలన వైఫల్యాలను ఎండగడుతూ ఆ పార్టీ నేతలపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు (Chandrababu)ఈసారి ఏకంగా వైసీపీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌(YS Jagan)ని టార్గెట్ చేస్తూ ఓ వార్తను తన సోషల్ మీడియా(Social media) అకౌంట్ ద్వారా ప్రజలకు షేర్ చేశారు. విచిత్రం ఏమిటంటే రాష్ట్రాన్ని పాలిస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన సొంత నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, మౌళిక సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యారని చెప్పే ప్రయత్నం చేశారు చంద్రబాబు.…

AP

GDS ఉద్యోగాలు.. సెలక్ట్ అయిన అభ్యర్థుల జాబితా రిలీజ్..

ఇండియన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఎప్పటికప్పుడు పలు జాబ్స్‌కి నోటిఫికేషన్లు ఇస్తూ ఉంటుంది. దానికి సంబంధించిన రిజల్ట్స్‌ కూడా చెప్పిన టైమ్‌కి రిలీజ్ చేస్తుంది. పదోతరగతి పూర్తై ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు భారత తపాలా శాఖ గతంలో భారీ నోటిఫికేషన్ విడుదలచేయగా..దానికి సంబంధించిన తుది జాబిత విడుదల చేసింది. 12,848 పోస్టుల భర్తీకి ఈ జాబిత రిలీజ్ అయ్యింది. దేశ వ్యాప్తంగా బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల్లో స్పెషల్ జిడిఎస్ ఆన్ లైన్ ఎంగేజ్ మెంట్ కింద 5,746…

APWorld

హెచ్ 1 బీ వీసాదారుల కుటుంబ సభ్యులకు శుభవార్త

అమెరికాలో ఉద్యోగం చేయడానికి అవకాశం కల్పించే హెచ్ 1బీ (H-1B vis) వీసా ఉన్నవారికి కెనడా శుభవార్త తెలిపింది. హెచ్ 1 బీ వీసాదారులు కెనడా (Canada)లో ఉద్యోగం చేయడానికి ఓపెన్ వర్క్ పర్మిట్ విధానాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ప్రతీ సంవత్సరం 10 వేల మందికి ఈ అవకాశం కల్పిస్తామని వెల్లడించింది. అలాగే, హెచ్ 1 బీ వీసాదారుల కుటుంబ సభ్యులకు కెనడాలో ఉద్యోగం చేయడానికి కానీ, చదువుకోవడానికి కానీ ఎలాంటి ఆంక్షలు లేకుండా అనుమతి ఇస్తున్నట్లు…

APCINEMA

విజయ్ ఆంటోనీ విక్రమ్ రాథోడ్ ఫస్ట్ లుక్ రిలీజ్

కెరీర్ ఆరంభం నుంచే వైవిధ్యభరితమైన పాత్రలు పోషిస్తూ బిజీ ఆర్టిస్ట్ అయ్యారు విజయ్ ఆంటోనీ. విలక్షణ నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్న ఆయన రీసెంట్ గానే బిచ్చగాడు 2 సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు. అదే జోష్ లో ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. విజయ్ ఆంటోనీ హీరోగా విక్రమ్ రాథోడ్ సినిమా తెలుగులో రాబోతోంది. అపోలో ప్రొడక్షన్స్, SNS మూవీస్ సంయుక్త…

AP

నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఇవ్వాళ్టికి 144వ రోజుకు

నెల్లూరు: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఇవ్వాళ్టికి 144వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ఈ పాదయాత్ర నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రవేశించారు. సర్వేపల్లి మీదుగా నెల్లూరు రూరల్‌లో ఎంట్రీ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ తిరుగుబాటు శాసన సభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆయన సోదరుడు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి నారా లోకేష్‌కు ఘన స్వాగతం పలికారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు తెలుగుదేశం…

AP

ఏపీలో విప్లవాత్మకం- ప్రారంభించనున్న వైఎస్ జగన్

అమరావతి: రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న మరో ప్రాజెక్టు.. 108, 104 అంబులెన్సులు. అత్యున్నత ప్రమాణాలు, అత్యాధునిక సౌకర్యాలతో 108, 104 సర్వీసులను తీర్చిదిద్దారు. మారుతున్న కాలానికి, అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య ప్రమాణాలకు అనుగుణంగా వాటిని అందుబాటులోకి తీసుకొచ్చారు. 2020 జులైలో ఒకేసారి 1088 అంబులెన్సు వైఎస్ జగన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. విజయవాడలోని బెంజ్ సర్కిల్ వేదికగా జరిగిన కార్యక్రమంలో వాటిని జెండా ఊపి ప్రారంభించారు. ఆ…

AP

టీ20, వన్డే సిరీస్ ఆడబోయే టీమిండియాలో అనంతపురం అమ్మాయికి చోటు

భారత మహిళ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు బయలుదేరి వెళ్లబోతోంది. ఆ దేశ జాతీయ జట్టుతో మూడు చొప్పున ద్వైపాక్షిక సిరీస్‌లను ఆడబోతోంది. భారత్- బంగ్లాదేశ్ మధ్య మూడు చొప్పున టీ20, వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు షెడ్యూల్ అయ్యాయి. ఈ సిరీస్ టీ20 మ్యాచ్‌తో ఆరంభం కానుంది. తొలి మ్యాచ్ ఈ నెల 9వ తేదీన ఆరంభమౌతుంది. 22వ తేదీన ముగుస్తుంది. మ్యాచ్‌లన్నింటికీ మిర్‌పూర్‌లోని షేర్-ఎ-బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియం ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. దీనికి సంబంధించిన పూర్తి…

AP

వైఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి ఏపీ ఆ తర్వాత అధిష్టానం తప్పిదాల కారణంగా ఉనికికే ముప్పు

ఒకప్పుడు వైఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి ఏపీ ఆ తర్వాత అధిష్టానం తప్పిదాల కారణంగా ఉనికికే ముప్పు తెచ్చుకుంది. విభజన కారణంగా ఏపీలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, తెలంగాణలోనూ అధికారం కోసం అష్టకష్టాలు పడుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్టీపీతో ఉనికి చాటుకునేందుకుప్రయత్నిస్తున్న వైఎస్సార్ కూతురు షర్మిలను తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చుకోవడం ద్వారా గట్టెక్కాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. షర్మిల చేరికకు రంగం కూడా సిద్ధమైనట్లు, ఇందులో భాగంగా వైఎస్ సమాధి ఉన్న…