శ్రీ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి పార్వేట ఉత్సవం: కుమ్మరవాండ్లపల్లిలో కొండలరాయుడికి ప్రత్యేక పూజలు
శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో వెలసిన ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శ్రీ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి పార్వేట ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఉత్సవంలో భాగంగా స్వామివారు ‘కొండలరాయుడి’ రూపంలో కదిరికొండ నుంచి ఊరేగింపుగా కుమ్మరవాండ్లపల్లికి తరలివచ్చారు. పండుగ వాతావరణంలో జరిగిన ఈ వేడుకలో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. గ్రామ పొలిమేరల్లో స్వామివారికి మంగళవాయిద్యాలు, భజనల మధ్య గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. కుమ్మరవాండ్లపల్లికి చేరుకున్న కొండలరాయుడిని స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మరియు…

