ఏపీలో నో ప్లాస్టిక్..! సర్కార్ కీలక నిర్ణయం..!
ఆంధ్రప్రదేశ్ ను ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం కీలక చర్యలు తీసుకోబోతున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను అరికట్టేందుకు త్వరలోనే పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించబోతున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్ నిషేధంపై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి శాసనసభలో అడిగిన ప్రశ్నకు ఆయన కీలక సమాధానం చెప్పారు. వాస్తవానికి రాష్ట్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం ఉన్నప్పటికీ, గ్రౌండ్ లెవల్ లో అది సరిగా అమలు కావడం లేదన్నారు. ప్లాస్టిక్…

