సెప్టెంబరు మాసం. సినిమాల కోసం!
ఆగస్టులో టాలీవుడ్ కి గట్టి ఎదురు దెబ్బే తగలింది. వరుస వైఫల్యాలతో బాక్సాఫీసు అల్లాడిపోయింది. డబ్బింగ్ బొమ్మ జైలర్ ఒక్కటే కాస్త నిలబడగలిగింది. మిగిలినవన్నీ భారీ ఫ్లాపులే. అయితే సెప్టెంబరు విషయంలో టాలీవుడ్ భారీ అంచనాలు పెట్టుకొంది. ఈ నెలలో సినిమాలే సినిమాలు. అన్నింటిపై అంచనాలు ఉన్నాయి. మినిమం గ్యారెంటీ చిత్రాలు ఇప్పుడు వరుస కడుతున్నాయ్. సెప్టెంబరు 1న ‘ఖుషి’ విడుదల అవుతోంది. విజయ్ దేవరకొండ – సమంత జంటగా నటించిన ఈ చిత్రానికి శివ నిర్వాణ…

