National

NationalTELANGANA

మోడీకి US, UK మద్ధతు,BBC డాక్యుమెంటరీ పక్షపాతమని తేల్చివేత

భారత ప్రధాని నరేంద్ర మోడీ మీద రెండు సిరీస్ డాక్యుమెంటరీలను (BBC Modi) బీబీసీ ప్రసారం చేసింది. కానీ, ఇండియాలో(India) మాత్రం దాన్ని బ్యాన్ చేస్తూ సోషల్ మీడియా, మీడియా వేదికలపై ఆంక్షలు పెట్టారు. కేంద్రం విధించిన ఆంక్షలతో డాక్యుమెంటరీని భారత ప్రజలు చూడలేకపోయారు. కేరళలోని కొన్ని ప్రాంతాలు, హైదరాబాద్ లో ఆ డాక్యుమెంటరీని ప్రదర్శించడానికి కమ్యూనిస్ట్‌, కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగాలు ప్రయత్నం చేశాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రత్యేక స్క్రీన్లతో డాక్యుమెంటరీని ప్లే చేయాలని…

National

కొత్త పార్టీ ఎంట్రీతో.. త్రిపురలో బీజేపీకి చిక్కులు!

త్రిపురలో ఎన్నికల హడావుడి తారస్థాయికి చేరింది. ప్రజలను ఆకర్షించేందుకు పార్టీలన్నీ తమ అస్త్రాలకు పదును పెడుతున్నాయి. ఈక్రమంలో అధికార బీజేపీని ఓడించేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. బద్ధ శత్రువులగా ఉండే కాంగ్రెస్​, వామపక్షాలు కలిసిపోయాయి. బీజేపీకి ఇదొక చిక్కు అయితే.. వీటి మధ్య ఈ దఫా ఎన్నికల్లో కొత్త పార్టీ పోటీచేస్తుండటం మరో సమస్య! అదే.. కాంగ్రెస్​ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ప్రద్యుత్​ బిక్రమ్​ మానిక్య దేబ్​ బర్మ స్థాపించిన టిప్రా మోతా పార్టీ. కొత్త పార్టీ…

National

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తదుపరి డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ విక్రమ్ దేవ్ దత్

సీనియర్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ విక్రమ్ దేవ్ దత్ (Vikram Dev Dutt) డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తదుపరి డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. శనివారం ఆయన పేరును కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ప్రస్తుత డీజీసీఏ చీఫ్ అరుణ్ కుమార్ స్థానంలో ఆయన ఫిబ్రవరి 28న బాధ్యతలు స్వీకరించనున్నారు. విక్రమ్ దేవ్ దత్ 1993 బ్యాచ్ IAS అధికారి. ప్రస్తుతం ఎయిర్ ఇండియా అసెట్ హోల్డింగ్ చైర్మన్. 1989 బ్యాచ్ ఐఏఎస్ అయిన…

National

బీబీసీ డాక్యుమెంటరీ పై నిషేధం

ప్రధాని మోదీపై బీబీసీ (BBC)రూపొందించిన డాక్యుమెంటరీ (BBC documentary) ని షేర్ చేయకుండా బ్లాక్ చేయాలని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ట్విటర్, యూట్యూబ్ లను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆ డాక్యుమెంటరీ (BBC documentary) దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధంగా, దేశ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉందని, అందువల్ల ఆ డాక్యుమెంటరీ (BBC documentary)ని షేర్ చేయడాన్ని బ్లాక్ చేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో బీబీసీ రూపొందించిన ఆ డాక్యుమెంటరీ (BBC…

National

భారత సరిహద్దుకు అత్యంత సమీపంలో చైనా ‘డ్యామ్​’!

భారత సరిహద్దుల్లో చైనా చేసిన మరో పని తలనొప్పిగా మారింది! ఇండియా- నేపాల్​​ సరిహద్దుల్లో ఓ డ్యామ్​ను నిర్మిస్తోంది చైనా. ఇందుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు తాజాగా బయటకొచ్చాయి. డ్యామ్​.. ఎందుకు- ఎక్కడ? టిబెట్​లోని వాస్తవాధీన రేఖకు సమీపంలో.. ఇండియా- నేపాల్​తో సరిహద్దును పంచుకుంటోంది చైనా. కాగా.. ఈ ట్రై-జంక్షన్​కు కొంత దూరం నుంచి గంగా నదికి చెందిన ఉపనది మబ్జా జాంగ్బో ప్రవహిస్తోంది. ఈ మబ్జా జాంగ్బో.. నేపాల్​లోని కర్నాలీ నదిలో కలుస్తుంది. చివరికి అది…

National

ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ.. ఆగ్రహం వ్యక్తం చేసిన భారత ప్రభుత్వం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై, 2002 గుజరాత్ అల్లర్లపై అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ పట్ల భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అపఖ్యాతి పాలుచేసేందుకు రూపొందించిన, పక్షపాత ధోరణితో కూడిన ప్రచారమని ఆక్షేపించింది. వివరాలివే.. “దీన్ని గుర్తుంచుకోండి. ఇండియాలో ఇది ప్రసారం కాలేదు. కాబట్టి నేను దాని గురించి విన్నది, నా సహచరులు చూసి చెప్పిన దాన్ని బట్టి నేను వ్యాఖ్యానిస్తున్నా. అపకీర్తి పాలుచేసేందుకు ఈ కథనాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చిందని మేం…

National

పంజాబ్‌లో కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ

పంజాబ్‌లో కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ సీనియర్‌ నేత, పంజాబ్‌ మాజీ రాష్ట్ర ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్‌ సింగ్‌ బాదల్‌ (Manpreet Badal) బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ‘అంతర్గత కుమ్ములాటలు, ఫ్యాక్షనిజంతో నిండిన కాంగ్రెస్‌లో ఉండలేనంటూ.. మోదీ హయాంలో దేశం ప్రపంచంలో దౌత్యపరంగా, ఆర్థికంగా ఎంతో పురోగమించింది’ అని బీజేపీలో చేరాక బాదల్‌ వ్యాఖ్యానించారు. తన రాజీనామా లేఖను రాహుల్‌ గాంధీకి పంపించారు. మన్‌ప్రీత్ బాదల్ బుధవారం బీజేపీలో చేరారు. తన కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించే…

NationalTechnology

మైక్రోసాఫ్ట్‌ బిగ్‌ షాక్‌.. 11 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన

ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచిన టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఏకంగా 11 వేల మంది ఉద్యోగస్తులను తొలగించేందుకు సిద్ధం అయ్యింది. ఈ మధ్య కాలంలోనే అమెజాన్, మెటా, ట్విట్టర్ ఇలా ప్రముఖ టెక్ కంపెనీలు లే ఆఫ్ చేపట్టడం ద్వారా భారీ ఎత్తున ఉద్యోగస్తులను తొలగించిన విషయం తెలిసిందే. నేటి నుండి మైక్రోసాఫ్ట్ కూడా అదే బాటలో నడవబోతోంది. హెచ్ ఆర్, ఇంజనీరింగ్ విభాగాల్లో అత్యధికంగా తొలగింపులు ఉంటాయని సంస్థ యొక్క ప్రతినిధులు పేర్కొన్నారు. ఆర్థిక సంక్షోభంతో పాటు…

National

జూన్ 2024 వరకు నడ్డానే బీజేపీ చీఫ్

BJP జాతీయ కార్యవర్గ కమిటీ సమావేశాలు ఢిల్లీలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్ష ఎన్నిక విషయమై బీజేపీ సీనియర్ నేత అమిత్ షా స్పష్టతనిచ్చారు. కొరోనా మహమ్మారి కారణంగా పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయలేకపోయామన్నారు. పార్టీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా కొనసాగుతారని ఢిల్లీలో జరుగుతున్న జాతీయ కార్యవర్గ కమిటీ సమావేశాల్లో బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. జూన్ 2024 వరకు నడ్డా అధ్యక్షత కొనసాగుతుందన్నారు. జాతీయ కార్యవర్గ…

National

బంగాళాఖాతంలో చిక్కుకున్న 600 మంది భక్తులు

గంగాసాగర్‌లో పుణ్యస్నానానికి వెళ్లిన భక్తులు బంగాళాఖాతంలో చిక్కుకున్నారు. అలా రాత్రంతా అక్కడే గడిపారు. వారిని పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మకర సంక్రాంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన దాదాపు 600 మంది భక్తులు (600 Devotees) 24 పరగణాల జిల్లా గంగాసాగర్‌లో పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ సమయంలో దట్టమైన పొగమంచు, గాలి కారణంగా బంగాళాఖాతంలో రెండు పడవలు కూడా బురదలో కూరుకుపోయాయి. దీంతో యాత్రికులు రాత్రంతా సముద్రంలో గడపాల్సి వచ్చింది. కాక్‌ద్వీప్‌లో ఈ ఘటన జరిగినట్లు అధికారులు…