National

NationalTELANGANA

సంక్రాంతికి కోటి 20 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చిన టీఎస్ఆర్టీసీ

జనవరి 11 నుంచి 14 వరకు సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కోటీ 20 లక్షల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చిందని టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. రాష్ట్రం నుండి కోటి మంది ప్రయాణికులు జిల్లాల మీదుగా వెళ్లి..తిరిగి రావడానికి బస్సు సేవలను ఉపయోగించారని తెలిపారు. ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి TSRTC 3203 ప్రత్యేక బస్సులను నడిపిందని.. .వివిధ ప్రాంతాల నుండి తిరిగి నగరానికి చేరుకోవడానికి…

National

సైన్యంలో ‘అగ్నిపథ్’ ఓ గేమ్ చేంజర్: ప్రధాని నరేంద్ర మోదీ

సైన్యాన్ని బలోపేతం చేయటంలో అగ్నిపథ్ పథకం ఒక గేమ్ ఛేంజర్‌గా ఉంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లకు సైన్యం మరింత సిద్ధంగా ఉండేందుకు అగ్నిపథ్ ఎంతో ముఖ్యమని అన్నారు. త్రివిధ దళాల్లో చేరుతున్న తొలి బ్యాచ్ అగ్నివీరులతో (Agniveers) ప్రధాని మోదీ సోమవారం (జనవరి 16) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కీలకమైన మైలు రాయిగా నిలిచే అగ్నిపథ్ పథకానికి మార్గదర్శకులుగా నిలిచారని తొలి బ్యాచ్ అగ్నివీరులను ప్రశంసించారు. మరింత యూత్‍ఫుల్‍గా..…

National

ప్రైవేట్ ఉద్యోగుల జీతాలు ఈ ఏడాది భారీగా పెరుతాయా.. ?

ప్రైవేట్ ఉద్యోగం చేసే వాళ్లకు ఎవరికైనా జీతం ఎప్పుడు పెరుగుతుందా అనే ఎదురుచూపు ఉంటుంది. ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగులను కాపాడుకోవడానికి ప్రతి ఏడాది ఉద్యోగుల జీతాలను పెంచుకుంటే పోతుంటాయి.అయితే 2023లో ప్రైవేట్ ఉద్యోగుల జీతాలు 9.8శాతం మేర పెరగుతాయనే వార్త ఉద్యోగుల్లో కొత్త ఆశలను చిగురింపజేస్తోంది. కోర్న్ ఫెర్రీ సర్వేలో ఇలాంటి ఆసక్తికర విషయాలు ఉండగా.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కొత్త ఏడాదిలో కంపెనీలు ఉద్యోగులకు భారీగా జీతాలు పెంచడానికి ముందుకు రానున్నట్లు కోర్న్ ఫెర్రీ సర్వేలో…

National

గుజరాత్ ఎన్నికలే ఆ విషయాన్ని చెప్పేశాయి: కేంద్ర మంత్రి అమిత్ షా

వచ్చే ఏడాది జరిగే లోక్‍సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party – BJP) విజయం ఖాయమని, మరోసారి తమ పార్టీ కేంద్రంలో అధికారం చేపడుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) అన్నారు. నరేంద్ర మోదీ (Narendra Modi) మళ్లీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపడతారని ధీమా వ్యక్తం చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల (Gujarat Elections) ఫలితాలే ఈ విషయాన్ని చెప్పేశాయని అమిత్ షా…

National

కస్టమర్లను మోసం చేసిన ఆర్‌బీఎల్ బ్యాంక్ మాజీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ అరెస్ట్‌

ఢిల్లీలోని వసంత్‌ కుంజ్‌ ప్రాంతంలో ఆర్‌బీఎల్ బ్యాంక్ మాజీ అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్ నాగేంద్ర కుమార్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. 2020 ఆగస్టులో బ్యాంక్ ఇద్దరు ఖాతాదారుల ఖాతాల నుంచి రూ.19.80 కోట్లను తన సొంత బ్యాంకు ఖాతాలోకి జమ చేసేందుకు ప్రయత్నించినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ స్కామ్‌ జరిగినప్పుడు ఢిల్లీలోని బరంఖంబా రోడ్‌లోని ఆర్‌బీఎల్ బ్యాంక్ బ్రాంచ్‌లో కుమార్‌ను అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, ఇంప్లిమెంటేషన్, క్లయింట్ సపోర్ట్ గా నియమించినట్లు RBL బ్యాంక్ విజిలెన్స్…

National

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపు ఫోన్ కాల్స్

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) కి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఆయనను కాల్చి చంపేస్తామని ఆ ఫోన్ కాల్స్ లో ఆగంతకుడు బెదిరించాడు. Nitin Gadkari gets death threat: ఆఫీస్ ను కూడా పేల్చేస్తాం.. నాగపూర్ లోని నితిన్ గడ్కరీ (Nitin Gadkari) కార్యాలయానికి శనివారం ఉదయం ఈ బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. నితిన్ గడ్కరీని చంపేస్తామని, ఆయన ఆఫీస్ ను పేల్చేస్తున్నామని అందులో…

National

ఆదాయపు పన్నును ఆదా చేసేందుకు కొందరు అడ్డదారులు

ఆదాయపు పన్నును ఆదా చేసేందుకు కొందరు అడ్డదారులు వెతుకుతూ ఉంటారు. ఈక్రమంలో తప్పులు చేస్తారు. దానికి తగిన జరిమానాలు చెల్లించుకుంటారు. అయితే మీరు చట్టపరమైన మార్గంలో కూడా ఆదాయపు పన్నును ఆదా చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం అనేక ఆప్షన్లు ఇచ్చింది. ప్రతి పన్ను చెల్లింపుదారుడు ఈ చట్టబద్ధమైన పద్ధతులను ఉపయోగించడం ద్వారా పన్నును ఆదా చేసుకోవచ్చు. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి మరికొంత సమయం మాత్రమే మిగిలి ఉంది. అటువంటి పరిస్థితిలో.. మీరు మీ ఆర్థిక ప్రణాళికను…

National

పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులకు రైల్వేలో చేరేందుకు ఇది గొప్ప అవకాశం

పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులకు రైల్వేలో చేరేందుకు ఇది గొప్ప అవకాశం. సెంట్రల్ రైల్వేలో అప్రెంటీస్ పోస్టులకు సంబంధించిన 2000 కంటే ఎక్కువ ఖాళీల కోసం దరఖాస్తులను ఆహ్వానించారు. దీని చివరి తేదీ సమీపించింది. సెంట్రల్ రైల్వే అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ దరఖాస్తు ఫారమ్‌ను నింపని అభ్యర్థులు ఇక దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ట్రేడ్‌లలో ముంబై, భుసావల్, పూణే, నాగ్‌పూర్, సోల్పూర్ క్లస్టర్‌ల పరిధిలో ఈ పోస్టుల భర్తీ జరుగుతోంది. వీటి పరిధిలో ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, పెయింటర్,…

National

ముంబైలో ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి కేటీఆర్

తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం ముంబైలో మెరుపు పర్యటనలు చేసి పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశం అయ్యారు. ముంబైలోని టాటా కార్పోరేట్ కేంద్ర కార్యాలయం బాంబే హౌజ్‌లో టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్‌ చంద్రశేఖరన్‌తో మంత్రి కేటీఆర్ భేటీ అయి తెలంగాణలో పెట్టుబడులపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా తెలంగాణలో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధి, తమ ప్రభుత్వం అమలుచేస్తున్న అత్యుత్తమ పారిశ్రామిక విధానాలపై మాట్లాడిన మంత్రి కేటీఆర్, తెలంగాణలో టాటా గ్రూపు…

National

చివరి టోర్నీ ఇదేనంటూ.. రిటైర్మెంట్‌పై సానియా మీర్జా ఎమోషనల్ నోట్!

భారత టెన్నిస్ స్టార్, హైదరాబాద్ అందం ‘సానియా మీర్జా’ రిటైర్మెంట్ గురించి సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. 2022 సీజన్‌తోనే టెన్నిస్ కెరీర్‌కి ముగింపు పలకబోతున్నట్టు గతంలో సానియా ప్రకటించినా.. గాయం కారణంగా ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు. ఇక దుబాయ్ ఓపెన్‌ 2023 తర్వాత సానియా రిటైర్మెంట్‌ ప్రకటిస్తారని నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. అన్ని వార్తలకు చెక్ పెడుతూ ఆస్ట్రేలియా ఓపెన్‌ 2023 తోనే రిటైర్మెంట్ తీసుకోబోతున్నట్టు తాజాగా…