ప్రతీకారానికి సిద్ధంగా ఉన్నా వాయుసేన, నేవీ..! ప్రధానితో భేటీ..!
పహల్గమ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత వాయుసేన (ఐఏఎఫ్) సంసిద్ధత, ప్రభుత్వ ప్రతిస్పందన వ్యూహాలపై ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో వాయుసేన పరంగా అందుబాటులో ఉన్న ప్రతీకార అవకాశాలపై ప్రధానికి ఆయన వివరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రధాని అధికారిక నివాసం 7, లోక్ కల్యాణ్ మార్గ్‌లో జరిగిన ఈ సమావేశంపై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, దేశ భద్రతా పరిస్థితులు, ప్రభుత్వం పరిశీలిస్తున్న ప్రతీకార చర్యల…

