తమిళనాడులో బీజేపీ-అన్నాడీఎంకే పొత్తు..!
తమిళనాడులో అన్నాడీఎంకే, బీజేపీ పొత్తు ఖరారు అయింది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. ఈ మేరకు కేంద్ర మంత్రి అమిత్ షా అధికారిక ప్రకటన చేశారు. పళనిస్వామి నాయకత్వంలోనే అన్నాడీఎంకే ఎన్నికలకు వెళుతుందని ఆయన స్పష్టం చేశారు. అన్నాడీఎంకే అధినేత పళనిస్వామి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైతో కలిసి చెన్నైలో అమిత్ షా విలేకరుల సమావేశం నిర్వహించారు. 1998లో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత నేతృత్వంలో బీజేపీ,…

