National

ఉప ప్రధానిగా నీతీశ్ కుమార్..?

బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి అశ్విని కుమార్చౌబే సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్కుమార్ ఉప ప్రధాని కావాలని ఆయన ఆకాంక్షించారు. ఇది తన వ్యక్తిగత నిర్ణయం అని ఓ సమావేశంలో తెలిపారు. ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఈ విషయం హాట్టాపిక్గా మారింది.

 

జేడీయూ అధినేత నీతీశ్‌ కుమార్‌ను ఉపప్రధానిగా చూడాలనుకుంటున్నానని బీజేపీ నేత మాజీ కేంద్ర మంత్రి అశ్విని కుమార్చౌబే అన్నారు. “NDA కు నీతీశ్ కుమార్ అనేక సేవలు చేశారు. ఎన్డీయే కూటమికి ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివి. ఆయన సేవలను గుర్తించి ఆయనకు డిప్యూటీ పీఎం పదవి ఇవ్వాలని నా కోరిక. అదే జరిగితే.. బిహార్‌ నుంచి ఉప ప్రధాని అయిన రెండో వ్యక్తిగా నీతీశ్ చరిత్ర లిఖిస్తారు” అని చౌబే అన్నారు. అంతకుముందు బిహార్ నుంచి బాబూ జగ్జీవన్ రామ్ ఉపప్రధానిగా పనిచేశారు.

 

ఉప ప్రధాని పోస్ట్ ఏంటి..?

 

ఉప ప్రధాని పదవి.. భారతదేశంలో రాజ్యాంగబద్ధమైన పదవి కాదు. ప్రస్తుతం భారత ఉపప్రధాని లేరు. చివరగా లాల్ కృష్ణ అద్వానీ ఉప ప్రధానిగా ఎన్నికయ్యారు. అద్వానీ పదవీకాలం తరువాత 2004 మే 23 నుండి ఈ పదవి ఖాళీగా ఉంది. ఇప్పటివరకు ఏడుగురు వ్యక్తులు దేశ ఉప ప్రధాని పదవిని అలంకరించారు. వల్లభాయ్ పటేల్, మొరార్జీ దేశాయ్, చౌదరి చరణ్ సింగ్,జగ్జీవన్ రామ్, యశ్వంతరావు చవాన్, దేవి లాల్,లాల్ కృష్ణ అద్వానీ.. లాంటి ప్రముఖులు ఉప ప్రధాని పదవిలో ఉన్నారు.