APCINEMANationalTELANGANA

సౌత్ హీరోలకు ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో మంచి ఆదరణ క్రియేట్

సౌత్ హీరోలకు ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో మంచి ఆదరణ క్రియేట్ అయింది. ముఖ్యంగా ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సినిమాలను హిందీలో చూసేందుకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు.

అందుకే ఆ హీరోలను హిందీ సినిమాల్లో నటింపజేసేందుకు కొందరు స్టార్ నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. అందులో భాగంగానే ఒక బాలీవుడ్ స్టార్ హీరో చిత్రంలో
అల్లు అర్జున్
మరియు ఎన్టీఆర్ లను గెస్ట్ పాత్రలో నటింపజేసేందుకు దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇప్పటికే ఎన్టీఆర్ ఒక హిందీ సినిమాకు కమిట్ అయ్యాడు. వార్‌ 2 లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. తాజాగా అల్లు అర్జున్ కి కూడా బాలీవుడ్ నుండి పిలుపు రావడంతో కచ్చితంగా ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయి.