పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్ తో బిజీగా ఉన్నాడు.
హరిహర వీరమల్లు సినిమా
షూటింగ్ సగానికి పైగా పూర్తి అయింది.
ఇక తమిళ సూపర్ హిట్ చిత్రం వినోదయ సీతమ్ రీమేక్ షూటింగ్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.
హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ కార్యక్రమాలు ఇటీవలే ప్రారంభమై ఒక షెడ్యూల్ కూడా పూర్తయింది. ఆ చిత్రం పూర్తయిన వెంటనే సాహో సుజీత్ దర్శకత్వంలో ఓ జి సినిమా షూటింగ్ లో పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నాడు.
ఇంకా కొన్ని సినిమాలను కూడా
పవన్ కళ్యాణ్
కమిట్ అయ్యాడు అనే వార్తలు వస్తున్నాయి. వీటన్నింటిని కూడా కచ్చితంగా ఈ ఏడాది చివరి వరకు పూర్తి చేయాలని పట్టుదలతో పవన్ కళ్యాణ్ ఉన్నాడట.
వచ్చే సంవత్సరంలో ఎన్నికలు జరగబోతున్నాయి. కనుక బస్సు యాత్ర చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పర్యటించాలనుకుంటున్నాడు. అందుకే ఈ సంవత్సరంలోనే సినిమాలన్నీ ముగించేయాలని డెడ్ లైన్ పెట్టుకున్నాడు. మరి దర్శకులు ఆ డెడ్ లైన్ కి రీచ్ అవుతారా అనేది చూడాలి.