భారత్, మోడీపై అనుచిత వ్యాఖ్యలు: ముగ్గురు మాల్దీవుల మంత్రులపై వేటు, ప్రముఖుల కౌంటర్లు
భారత్, ప్రధాని నరేంద్ర మోడీపై మాల్దీవుల మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై భారత పౌరుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. లక్షద్వీప్‌లో మోడీ పర్యటనను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై భారత ప్రముఖులు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. లక్షదీవుల అందాలను వివరిస్తూ సోషల్ మీడియా వేదికగా మాల్దీవుల మంత్రులకు కౌంటర్లు ఇస్తున్నారు. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, జూనా అబ్రహాం, శ్రద్ధా కపూర్ వంటి వారు స్వదేశీ టూరిజానికి మద్దతుగా…

