దేశంలో 63 కొత్త ఉపరకం జేఎన్.1 కేసులు నమోదు..
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఆక్టివ్ కేసుల సంఖ్య 4,054కి చేరింది. అలాగే కొవిడ్ కొత్త సబ్ వేరియంట్ జేఎన్.1 కేసులు 63కు చేరాయని సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. వాటిలో అత్యధికంగా గోవాలో 34 కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్రలో తొమ్మిది మంది ఈ వేరియంట్ బారినపడ్డారు. కర్ణాటక(8), కేరళ(6), తమిళనాడు(4), తెలంగాణ(2)లో ఈ కేసులు బయటపడినట్లు కేంద్రం తన ప్రకటనలో వెల్లడించింది. జేఎన్.1 వేరియంట్ సోకినవారిలో స్వల్ప లక్షణాలు మాత్రమే…

