జమ్మూకాశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌కి సంబంధం లేదు.. యూకే పార్లమెంట్‌లో పీఓకే ప్రొఫెసర్..
జమ్ము కాశ్మీర్ వివాదంలో పాకిస్తాన్‌కి సంబంధమే లేదని, పాక్ చట్టబద్ధమైన పార్టీనే కాదని పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)కి చెందిన రాజకీయ కార్యకర్త, ప్రొఫెసర్ సజ్జాద్ రజా అన్నారు. బ్రిటన్ పార్లమెంట్ లో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పీఓకేలో ప్రజల్ని పాకిస్తాన్ జంతువుల్లా చూస్తోందని, జమ్మూ కాశ్మీర్ ప్రజలకు సౌకర్యాలను పొందే హక్కు ఉందని ఆయన అన్నారు. కొంతమంది బ్రిటీష్ ఎంపీలతో సహా పలువురు వక్తలు ఆర్టికల్ 370 తర్వాత కాశ్మీరీ పండిట్ల పోరాటాలు, జమ్మూ…

