National

National

భారీ వర్షాల దెబ్బతో బెంగళూరు ప్రజలకు బెంగ పట్టుకుంది. ట్రాఫిక్ సమస్యతో చిత్తడి!

కర్ణాటక రాష్ట్ర రాజధాని సిలికాన్ సిటీ బెంగళూరులో (Bengaluru) భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం రాత్రి నుండి పడుతున్న వర్షం (rain)సోమవారం కూడా కొనసాగింది. వాతావరణంలో మార్పుల కారణంగా వచ్చే మూడు రోజుల పాటు బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. బెంగళూరు నగరంలో ఇప్పటికే ఎల్లో అలర్ట్ ప్రకటించారు.   బెంగళూరులో (Bengaluru) గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు (rain)చాలవని సోమవారం మధ్యాహ్నం కుండపోతగా వర్షం కురిసింది. బెంగళూరు నగరంలోని…

National

తమిళనాడు రాష్ట్రంలోని అరియలూరు జిల్లాలో ఘోర ప్రమాదం

తమిళనాడు రాష్ట్రంలోని అరియలూరు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించడంతో 10 మంది కార్మికులు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. వెట్రియార్‌కు చెందిన రాజేంద్రన్ యాజ్ ఫైర్ వర్క్స్ పేరిట ఓ బాణసంచా తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. సోమవారం ఉదయం 10 గంటల సమయంలో అందులో ఆకస్మాత్తుగా పేలుడు సంభవించింది.…

National

మధ్యప్రదేశ్ ఎన్నికలు: ఎట్టకేలకు ముఖ్యమంత్రికి టికెట్ వచ్చింది, 57 మందితో జాబితా రిలీజ్

భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ అధికార భారతీయ జనతా పార్టీ 57 మంది అభ్యర్థులతో కూడిన నాలుగో జాబితాను సోమవారం విడుదల చేసింది. ఇప్పటి వరకు సీటు కేటాయించకపోవడంతో ఉత్కంఠ కొనసాగిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు కూడా ఈ జాబితాలో ఉండటం గమనార్హం. సంప్రదాయంగా వస్తున్న బుధ్నీ సీటు నుంచే శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ ఎన్నికల్లోనూ పోటీ చేయనున్నారు. మొదట సీఎం శివరాజ్ సింగ్‌కు మూడు జాబితాల్లోనూ…

National

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆధ్వర్యంలో ఇవాళ ఢిల్లీలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సు

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆధ్వర్యంలో ఇవాళ ఢిల్లీలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సు జరిగింది. ఇందులో ఏపీతో పాటు ఆరు రాష్ట్రాలు పాల్గొన్నాయి. ఇందులో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ కీలక ప్రసంగం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గడిచిన నాలుగు దశాబ్దాలుగా వామపక్ష తీవ్రవాద సమస్యపై పోరాడుతోందని జగన్ తెలిపారు. ఈ ప్రాంతాల్లో జాతీయ విధానం, కార్యాచరణ ప్రణాళిక ప్రకారం తీసుకున్న చర్యలు, అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, స్ధానిక ప్రజల హక్కుల పరిరక్షణ…

National

31 ఏళ్ల జైలు శిక్ష, 154 కొరడా దెబ్బలు: ఇరాన్ మహిళకు నోబెల్ శాంతి బహుమతి

స్టాక్‌హోమ్: ప్రఖ్యాత శాస్త్రేవేత్తలు, ఆర్థికవేత్తలు, సాహితీవేత్తలు, రచయితలు, ఇతర సామాజిక ఉద్యమకారులకు ప్రతి సంవత్సరం అందించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ బహుమతుల ప్రకటనలు కొనసాగుతున్నాయి. వారం రోజుల పాటు ఈ అవార్డుల ప్రకటన ఉంటుంది. ఒక్కో రోజు ఒక్కో రంగంలో కృషి చేసిన వారికి నోబెల్ బహుమతుల ప్రకటన చేస్తూ వస్తోన్నారు జ్యూరీ కమిటీ సభ్యులు. ఆర్థికం, వైద్యం, సామాజిక అంశాలు, పర్యావరణం, ఫిజిక్స్.. ఇలా విభిన్న రంగాల్లో నూతన ఒరవడిని సృష్టించిన, వాటికి ఆద్యులైన శాస్తవేత్తలకు…

National

ఖానాపూర్‌లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రేఖానాయక్ పార్టీకి గుడ్‌బై

ఖానాపూర్‌లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రేఖానాయక్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. బీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, రాజీనామా చేసినా ఆమె పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే, తెలంగాణ ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు. తెలంగాణ సిఎం కెసిఆర్ మాటతప్పారని, కెటిఆర్ చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్తానని అన్నారు. వచ్చే ఎన్నికలో తాను పోటీచేస్తానని, బిఆర్ఎస్ అభ్యర్థి ఎలా గెలుస్తారో నేను చూస్తానని సవాలు విసిరారు. నాపై లేని పోని ఆరోపణలు చేశారు : అయితే, ఖానాపూర్…

National

రైలులో వృద్ధ దంపతులపై మూత్ర విసర్జన చేసిన యువకుడు..

బస్సు, రైలు, విమానాల్లో ప్రయాణిస్తున్నప్పుడు మద్యం తాగిన వారు వింతగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా ఓ యువకుడు రైలులో వృద్ధ జట్టపై మూత్రవిసర్జన చేశాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ AC కోచ్‌లో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అక్టోబర్ 4వ తేదీ బుధవారం మధ్యప్రదేశ్‌లోని హర్పాల్‌పూర్ నివాసి డాక్టర్ జిఎన్ ఖరే, అతని 60 ఏళ్ల భార్య ఉత్తర ప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో న్యూఢిల్లీకి బయల్దేరారు. వారు…

National

ఆ రూ.27 కోట్లు విరాళాలే- స్కిల్ స్కాం నిధులు కాదు- సీఐడీ ఆరోపణలకు టీడీపీ కౌంటర్..

ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్నట్లు చెబుతున్న స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో రూ.27 కోట్ల నిధులు నిందితుల ఖాతాల నుంచి డొల్ల కంపెనీలకు వెళ్లి అక్కడి నుంచి టీడీపీ ఖాతాల్లోకి చేరినట్లు నిన్న సీఐడీ ఏసీబీ కోర్టుకు ఆధారాలు సమర్పించింది. దీంతో ఈ స్కాంలో నిధులు టీడీపీకి చేరిన అంశంపై చర్చ మొదలైంది. ఇన్నాళ్లు రూ.371 నిధులు చేతులు మారాయని ఆరోపిస్తున్న సీఐడీ.. చివరకు రూ.27 కోట్ల నిధులు టీడీపీ ఖాతాల్లోకి చేరినట్లు చేసిన…

National

దేశంలో 2,000 రూపాయల నోట్ల చలామణికి పుల్ స్టాప్

ముంబై: దేశంలో 2,000 రూపాయల నోట్ల చలామణికి పుల్ స్టాప్ పడింది. ఇప్పటివరకు మనుగడలో ఉంటూ వచ్చిన ఈ పెద్ద నోటు ఇక తెరమరుగయింది. ఇకపై ఈ నోట్లేవీ మార్కెట్‌లో చెల్లుబాటు కావు. వీటిపై ఎలాంటి లావాదేవీలను కూడా నిర్వహించలేం. అందుబాటులో ఉన్న నోట్లను మార్పిడి చేసుకోవడానికి అక్టోబర్ 7వ తేదీ వరకు గడువు ఉంది. గతంలో సెప్టెంబర్ 30వ తేదీ నాటికే చివరి గడువు విధించింది భారతీయ రిజర్వ్ బ్యాంక్. దీన్ని మరో వారం రోజుల…

National

మొన్న ‘మోత మోగింది’.. రేపు దీపాలుండవ్..!!

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి అరెస్ట్ ను ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ మరో కార్యక్రమానికి పిలుపునిచ్చింది. మొన్న మోత మోగించగా, రేపు గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిపిద్దాం పేరుతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనుంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు శనివారం రాత్రి 7.00 గంటలకు ఇళ్లల్లో లైట్లు ఆర్పి ఇంటి బయట సెల్ టార్చ్ లేదంటే కొవ్వొత్తుల వెలిగించి ఐదు నిముషాలపాటు నిరసన తెలియజేయాలని సూచించారు. ఈమేరకు పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు…