National

National

జులై 13న చంద్రయాన్‌ 3 ప్రయోగం.. ఇస్రో చీఫ్‌ అధికారిక ప్రకటన

దిల్లీ: జాబిల్లిపై అన్వేషణకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోన్న చంద్రయాన్‌-3 (Chandrayaan-3) ప్రయోగానికి ముహూర్తం ఖరారయ్యింది. జులై 13న ఈ ప్రయోగం చేపట్టనున్నట్లు ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌. సోమనాథ్‌ సోమవారం అధికారికంగా వెల్లడించారు. ప్రయోగ లాంఛ్‌ విండో జులై 19వ తేదీ వరకు ఉందని తెలిపారు. చంద్రయాన్‌-3 (Chandrayaan-3) ప్రయోగ తేదీపై ఇటీవల అనధికారిక వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో వాటిపై స్పందించిన సోమ్‌నాథ్‌.. తేదీని ఇంకా నిర్ణయించలేదని తెలిపారు. తాజాగా…

CINEMANationalTELANGANA

ప్రెషర్ స్పీడ్‌ల్లో మార్పు.. ఇస్రో ఇంజిన్ టెస్టు నిలిపివేత

వెల్కమ్ టు డైనమిక్ లీడర్ కేటీఆర్ గారు అంటూ ఫ్లెక్సీలు విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించుకొని సగర్వంగా నగరానికి వస్తున్న రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఘన స్వాగతం పలుకుతూ ఓఆర్ఆర్ పై స్వాగత బ్యానర్లు వెలిశాయి. వెల్కమ్ టు డైనమిక్ లీడర్ కేసీఆర్ అంటూ ఆ పార్టీ నాయకుడు అలిశెట్టి అరవింద్ ఔటర్ రింగ్ రోడ్డుపై బ్యానర్లను ఏర్పాటు చేయించారు. లండన్ అమెరికా దేశాలలో పర్యటించి 42 వేలకు పైగా ఉద్యోగ కల్పన…

CINEMANational

ఆశక్తికరంగా సాగే సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్ “చక్ర వ్యూహ్యం” రివ్యూ

బేబీ అన్వి సమర్పణలో సహస్ర క్రియేషన్స్ బ్యానర్‌పై విలక్షణ పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు అజయ్ ప్రధాన పాత్రలో చెట్కూరి మధుసూధన్ దర్శకత్వంలో తెరకెక్కిన మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌ చిత్రం ‘చక్రవ్యూహం’ -ది ట్రాప్ అనేది ఉపశీర్షిక. శ్రీమతి. సావిత్రి గారు నిర్మించిన ఈ చిత్రం జూన్ 2 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి కథ వివేక్ (…

National

జూలై 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల భేటీ-పాత భవనంలో ప్రారంభమై కొత్త భవనంలోకి..

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నిర్వహణకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈసారి వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టి చర్చించాల్సిన కీలక బిల్లులపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిన కేంద్రం.. ఈ నెల 20న సమావేశాల ప్రారంభానికి రంగం సిద్ధం చేస్తోంది. అయితే ఈసారి సమావేశాలకు ఓ ప్రత్యేకత ఉంది. పార్లమెంటు పాత భవనంలోనే ప్రారంభం కాబోతున్న ఈ సమావేశాలు మధ్యలో కొత్త భవనానికి మారబోతున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20న ప్రారంభమై ఆగస్టు 11 వరకు కొనసాగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల…

National

బక్రీద్ నేపథ్యంలో గోహత్య ఘటనకు సంబంధించి ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్

బెంగళూరు/బాదామి: బక్రీద్ నేపథ్యంలో గోహత్య ఘటనకు సంబంధించి ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణకు కర్ణాటక నార్త్ జోన్ ఐజీపీ వికాసకుమార్ స్వయంగా పర్యటించి పరిశీలించారు. దీనికి తోడు భారీ పోలీసు బందోబస్తు ఇంకా కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి కర్ణాటకలోని బాదామి తాలూకా పట్టణానికి చెందిన బాదామి తాలూకకు చెందిన మహ్మద్ అజారుద్దీన్ నబీసాబ హులికేరి, అఖ్తాబ్ నబీసాబ హులికేరి, మహ్మద్ జామీ హుసేనసాబ…

CINEMANational

దర్శక ధీరుడు రాజమౌళికి మరో అరుదైన గౌరవం

దర్శక ధీరుడు రాజమౌళికి మరో అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఫర్ క్రికెట్‌(ISBC)కు గౌరవ చైర్మన్‌గా నియమితులయ్యారు. గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయస్థాయి క్రికెటర్లుగా ఎదగాలనుకునేవారిని ఈ బోర్డు గుర్తించి ప్రోత్సహిస్తుంది. మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్ సర్కార్ గైడెన్స్ లో ఐఎస్ బీసీ ఏర్పాటైంది. తాను కూడా క్రికెట్ ఆడేవాడినని, ఆ ఆటంటే తనకు చాలా ఇష్టమన్నారు. స్కూల్ టైంలో తమ ఊర్లో క్రికెట్ ఆడేవాడినని రాజమౌళి వ్యాఖ్యానించారు. గ్రామీణ ప్రాంతాల్లో అద్భుతమైన…

NationalTechnology

ప్రవీణ్ ఎఫెక్ట్, పంజా విసిరిన ఎన్ఐఏ, సిద్దూ ప్రభుత్వానికి షాక్, పీఎఫ్ఐ లీడర్స్ తో !

బెంగళూరు: కర్ణాటకలో గత జూలైలో జరిగిన హిందూ కార్యకర్త ప్రవీణ్ నెట్టారు హత్య కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు నిషేధిత పీఎఫ్‌ఐ సంస్థ కార్యకర్తల ఇళ్లపై దాడులు చేశారు. బీజేపీ నేత ప్రవీణ్ నెట్టారు హత్య కేసుకు సంబంధించి దక్షిణ కన్నడ జిల్లా, కొడగు జిల్లాలో నిషేధిత పీఎఫ్‌ఐ కార్యకర్తల ఇళ్లపై మంగళవారం అధికారులు దాడులు చేశారు. రెండు జిల్లాల్లోని ఆరు చోట్ల అధికారులు మంగళవారం దాడులు…

National

“వ్యూహం” పై ఆర్జీవీకి కాంగ్రెస్ వార్నింగ్ – బట్టలూడదీసి కొడతాం, ఖబడ్దార్..!!

వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మకు కాంగ్రెస్ నుంచి హెచ్చరికలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి జగన్ పొలిటికల్ లైఫ్ ఆధారంగా ఆర్జీవీ తీస్తున్న వ్యూహం టీజర్ కు విశేష స్పందన వచ్చింది. అందులో వైఎస్సార్ మరణం సమయం నుంచి రాజకీయంగా జగన్ చేసిన రాజకీయ పోరాటం హైలైట్ చేసారు. కాంగ్రెస్ తీరు..కేసులు…సీబీఐ విచారణ..ఓదార్పు యాత్ర అన్నీ కంటికి కట్టినట్లుగా చూపించే ప్రయత్నం చేసి నట్లుగా స్పష్టం అవుతోంది. దీని పైన ఇప్పుడు కాంగ్రెస్ నేతలు సీరియస్ అవుతున్నారు. వ్యూహం…

National

మహారాష్ట్రపై ఫుల్ ఫోకస్: కేసీఆర్ రెండ్రోజుల పర్యటన, కీలక నేతల చేరిక

హైదరాబాద్: మహారాష్ట్రపై భారత్ రాష్ట్ర సమితి(BRS) ప్రత్యేక ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపట్నుంచి(జూన్ 26) రెండు రోజులపాటు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. మహారాష్ట్రలోని పండరీపూర్, తుల్జాపూర్‌లో ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం షోలాపూర్‌లో నిర్వహించే పార్టీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు రోడ్డు మార్గాన హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు బయల్దేరి వెళ్లనున్నారు. సీఎం కేసీఆర్ వెంట పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,…