టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీలో సంచలన విషయాలు: బ్లూటూత్‌తో పరీక్ష రాశారు, నలుగురి అరెస్ట్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) ప్రశ్నపత్రం లీకేజీ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసుకు సంబంధించి తాజాగా మరో నలుగురిని ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) అరెస్ట్ చేసింది. వరంగల్ విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజినీర్(డీఈ) రమేష్ తోపాటు ప్రశాంత్, మహేశ్, నవీన్ అరెస్ట్ అయినవారిలో ఉన్నారు. ఏఈఈ, డీఏవో పరీక్షకు సంబంధించిన 25 ప్రశ్నపత్రాలను డీఈ రమేష్ విక్రయించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ఏఈఈ పరీక్షలో ఏడుగురు అభ్యర్థులకు పరీక్ష హాల్‌లోకి ఎలక్ట్రానిక్…

