మహారాష్ట్రలో ఎన్నికల్లో తొలి విజయం; ఖాతా తెరిచిన బీఆర్ఎస్ పార్టీ!!
తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా కాలంగా మహారాష్ట్ర రాజకీయాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్న విషయం తెలిసిందే. మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీని విస్తరించడానికి కెసిఆర్ చేసిన ప్రయత్నాలు ఫలిస్తున్నాయనే చెప్పాలి. తాజాగా మహారాష్ట్ర గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తొలి విజయం నమోదు చేసుకుంది. మహారాష్ట్రలోని అంబే లోహల్ గ్రామంలో జరిగిన గ్రామ పంచాయతీ ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థి గఫూర్ పఠాన్ విజయం సాధించారు. 115 ఓట్ల తేడాతో…

