ఢిల్లీ పై పంజాబ్ ఘన విజయం.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
ఐపీఎల్(IPL) 2023లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్(Punjab Kings) విజయం సాధించింది. లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులకు పరిమితమైంది. దీంతో 31 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించింది. ఢిల్లీ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్(54; 27 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకంతో రాణించగా ఫిలిఫ్ సాల్ట్ (21) ఫర్వాలేదనిపించాడు.…

