ఛత్తీస్‌గఢ్ బస్తర్‌లో జరిగిన నక్సల్స్ దాడిలో 10 మంది పోలీసులతో పాటు ఒక డ్రైవర్ మృతి
ఛత్తీస్‌గఢ్ బస్తర్‌లో జరిగిన నక్సల్స్ దాడిలో 10 మంది పోలీసులతో పాటు ఒక డ్రైవర్ మృతి చెందిన విషయం తెలిసిందే. మావోలు మందుపాతర పేల్చడంతో ఈ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ మందుపాతర పేల్చేందుకు మావోలు 50 కిలోల ఐఈడీ(IED)ని వినియోగించారు. పేలుడు ధాటికి పెద్ద ఎత్తున గోతి ఏర్పడింది. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్‌కు చెందిన పోలీసులు ఓ అద్దె వ్యానులో వెళుతుండగా ఈ ఘటన జరిగింది. పేలుడు ధాటికి కనీసం 20 అడుగుల ఎత్తుకు…

