TELANGANA

TELANGANA

కేసీఆర్ ఈజ్ బ్యాక్…

అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమిని ఎదుర్కొన్న భారత్ రాష్ట్ర సమితి.. లోక్‌సభ బరిపై దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయాలను ఇక్కడ పునరావృతం కాకుండా చూసుకుంటోంది. అన్ని జాగ్రత్తలను తీసుకుంటోంది. లోక్‌సభ నియోజకవర్గ స్థాయిలో సమీక్షా సమావేశాలను నిర్వహిస్తోంది. రెండు- మూడు తప్ప అన్ని లోక్‌సభ నియోజకవర్గాలపైనా సమీక్షలు పూర్తి చేసింది.   అటు అధికార కాంగ్రెస్ పార్టీపై దాడికి సమాయాత్తమౌతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటి కోసం పోరుబాట పట్టబోతోంది. ఇప్పటికే రేవంత్ సర్కార్‌కు అల్టిమేటాన్ని…

TELANGANA

రేషన్ కార్డులపై రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్..

తెలంగాణలో రేషన్ కార్డుల జారీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఈ నెలాఖరు నాటికి ఈ-కేవైసీ గడువు ముగియబోతోన్న నేపథ్యంలో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. గడువును మరో నెల రోజుల పాటు పొడిగించింది.   ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో ఉన్న పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ.. రాష్ట్రవ్యాప్తంగా బోగస్‌ కార్డుల ఏరివేత చేపట్టిన విషయం తెలిసిందే. దీనికోసం లబ్దిదారులు తమ రేషన్‌ కార్డులను అప్‌డేట్ చేసుకోవడానికి ఈ-కేవైసీ విధానాన్ని…

TELANGANA

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు..

బీఆర్ఎస్ నేత, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆయన సతీమణి నీలిమపై పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తప్పుడు పత్రాలతో భూ ఆక్రమణలకు యత్నించారని పీర్జాదిగూడకు చెందిన రాధిక.. పల్లా దంపతులపై ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు పల్లా దంపతులపై కేసు నమోదు చేరశారు.   జోడిమెట్ల సమీపంలోని చౌదరిగూడ గ్రామపంచాయతీ పరిధిలోని ఫ్లాట్ల విషయంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి దంపతులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ప్లాట్లు 1984లో…

TELANGANA

రాజ్‌భవన్‌లో ఎట్ హోం: సీఎం రేవంత్ సహా ప్రముఖుల హాజరు, బీఆర్ఎస్ ముఖ్య నేతలు దూరం..

గణతంత్ర దినోత్సవం(Republic Day) సందర్భంగా రాజ్‌భవన్‌లో శుక్రవారం రాత్రి ఎట్‌ హోం కార్యక్రమం ఘనంగా జరిగింది. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అహ్వానం మేరకు సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) సహా మంత్రులు, వివిధ పార్టీల నేతలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, రాష్ట్రంలోని పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రతి సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవం, రిపబ్లిక్ డే రోజు గవర్నర్ ఆతిథ్యం ఇవ్వడం సాంప్రదాయంగా వస్తోంది.   కాగా, రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎట్హోం కార్యక్రమం జరగడం…

TELANGANA

రైతు భరోసా అమలు ముహూర్తం ప్రకటించిన రేవంత్..!!

ముఖ్యమంత్రి రేవంత్ కీలక ప్రకటన చేసారు. తెలంగాణలో రైతు భరోసా పైన చర్చ జరుగుతున్న వేళ ఈ పథకం ఎప్పుడు అమలు చేసేదీ క్లారిటీ ఇచ్చారు. అదే విధంగా ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన గ్యారంటీల అమలు పైన క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్, కేటీఆర్ పైన రేవంత్ మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేసారు. బీఆర్ఎస్ నేతలు తన పైన చేస్తున్న విమర్శలకు రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.   బీఆర్ఎస్…

TELANGANA

ఆ విషయంలో బట్టలిప్పి నిలబెడతాం: రేవంత్ రెడ్డిపై ఘాటుగా కేటీఆర్!!

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని అధికారంలోకి వచ్చిన 45 రోజులైనా రేవంత్ రెడ్డి సాధించింది ఏమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఢిల్లీ నుంచి సాగుతుందన్నారు.   రాష్ట్రంలో రైతు భరోసా ప్రారంభించినట్టు సీఎం రేవంత్ రెడ్డి అబద్ధం చెప్పారని కేటీఆర్ ఆరోపించారు. ఇలా అబద్ధాలు చెప్పినందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.…

TELANGANA

తెలంగాణను కీలక స్థావరంగా ఎంచుకున్న నావికాదళం… వికారాబాద్ జిల్లాలో నేవీ రాడార్ స్టేషన్.

భారత నావికా దళం తెలంగాణను కీలక స్థావరంగా ఎంచుకుంది. దేశంలోనే రెండో వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ స్టేషన్‌ను వికారాబాద్ జిల్లాలో నెలకొల్పుతోంది. నౌకలు, జలాంతర్గాములతో సంభాషించేందుకు నావికా దళం వీఎల్ఎఫ్ (వెరీ లో ఫ్రీక్వెన్సీ) కమ్యూనికేషన్ ట్రాన్స్ మిషన్ స్టేషన్‌ను ఉపయోగిస్తుంది. వికారాబాద్ మండలం పూడూరు సమీపంలోని దామగూడెం అటవీ ప్రాంతంలో ఈ స్టేషన్ ఏర్పాటు చేయనుంది. దేశంలోనే ఇది రెండో స్టేషన్. తమిళనాడులోని తిరునెల్వేలిలో ఉన్న ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ రాడార్ స్టేషన్ మొట్ట మొదటిది. 1990 నుంచి…

TELANGANA

రైతు రుణ మాఫీపై సర్కార్ కసరత్తు..

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రజలకు భారీ హామీలు ఇచ్చింది. ముఖ్యంగా రైతులకు చాలా హామీలు ప్రకటించింది. అందులో రైతు రుణ మాఫీ, రైతు భరోసా, రైతు కూలీలకు డబ్బులు ప్రముఖంగా ఉన్నాయి. ఈసారి పాత పద్ధతిలోనే రైతు బంధు జమ చేస్తున్నారు. వానకాలం నుంచి రైతు భరోసా అమలు చేయనున్నారు. ఇప్పటి వరకు ఎకరానికి రూ.10 ఇస్తుండగా.. రైతు భరోసాలో భాగంగా ఎకరానికి రూ. 15 వేలు ఇవ్వనున్నారు.   గత బడ్జెట్‌‌లో రైతుబంధుకు రూ.15070కోట్లు…

TELANGANA

ఫిబ్రవరి నెల నుంచి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీ అమలు..

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మరో హామీని అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. తాజాగా, రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉచిత్ విద్యుత్ పథకం అమలుపై కీలక ప్రకటన చేశారు. ఫిబ్రవరి నెల నుంచి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీ అమలు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. మంగళవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది.   కోమటిరెడ్డితోపాటు మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ…

TELANGANA

పార్టీ మార్పుపై గుత్తా సుఖేందర్ రెడ్డి క్లారిటీ..

శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది. అందుకే ఆయన బీఆర్ఎస్ నల్గొండ లోక్ సభ సన్నాహాక సమావేశానికి హాజరు కాలేదని చెబుతున్నారు. అయితే పార్టీ మార్పుపై గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. పార్టీ మారుతున్నట్లైతే తన కొడుకు అమిత్ రెడ్డికి టికెట్ ఎందుకు అడుగుతాను అని గుత్తా ప్రశ్నించారు. కాంగ్రెస్ కు దగ్గరవుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు.   అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్…