TELANGANA

TELANGANA

అభయహస్తం దరఖాస్తుకు ఆధార్ అప్ డేట్ తప్పని సరి కాదు!

ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లేందుకు, ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రజాసాలన పేరుతో గ్రామ, వార్డు సభలకు శ్రీకారం చుట్టింది. తొలి రోజు నిర్వహించిన సభలకు అనూహ్య స్పందన వచ్చింది. భారీగా వివిధ పథకాలతోపాటు, రేషన్‌ కార్డులకు దరఖాస్తు చేసుకున్నారు. ఒకరోజు గడిచినా ప్రజల్లో ఇంకా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏయే పథకాలకు తాము అర్హులం, ఎలా దరఖాస్తుత చేసుకోవాలి, రేషన్‌ కార్డు తప్పనిసరా? ఆధార్‌ కుటుంబంలో అందరికీ లేదు..…

TELANGANA

నల్ల నేలల్లో కేసీఆర్ గులాబీ బాణం విరగడానికి కారణాలు ఎన్నో..?

పాలనలో మితిమీరిన జోక్యం ఎక్కువ కావడంతో కెసిఆర్ కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు వద్దనుకున్నారు. తెలంగాణకు సిరిలాంటి సింగరేణి గనుల్లో కేసీఆర్ కుటుంబం పెత్తనం కూడా పెరిగిపోవడంతో ఇక్కడ కూడా రిక్త హస్తమే అందించారు. సింగరేణి గనుల్లో ఈసారి బీఆర్‌ఎస్‌ గులాబీ జెండా కనుమరుగైంది. రెండు సార్లు సింగరేణి గుర్తింపు సంఘంగా కొనసాగిన ఆ పార్టీ అనుబంధ విభాగం టీబీజీకేఎస్‌ ప్రస్తుత ఎన్నికల్లో అనూహ్యంగా వెనక్కి తగ్గింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీ ఓటమి చెందింది.…

TELANGANA

కాళేశ్వరం పై కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్..

కాళేశ్వరం అంత గొప్ప ప్రాజెక్టు లేదు. నా మెదడును రంగరించి, నా రక్తాన్ని ఖర్చు చేసి ఈ ప్రాజెక్టుకు డిజైన్ ఇచ్చాను. ప్రతిపక్షాలకు సోయిలేదు. ఎన్నడైనా వారి ముఖాలకు ఇలాంటి ప్రాజెక్టు కట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టును డిస్కవరీ ఛానల్ పొగిడింది. ఈ ప్రపంచంలోనే మానవ అద్భుత నిర్మాణం అంటూ కొనియాడింది. తెలంగాణకు జీవధార కాళేశ్వరం..ఇలానే కదా కేసీఆర్ నుంచి కేటీఆర్ దాకా పదే పదే చెప్పింది. వెళ్లిన చోటల్లా కాళేశ్వరం తొలి ఫలితం ఈ ప్రాంతానికే వస్తుంది…

TELANGANA

నో అసెంబ్లీ.. ఓన్లీ పార్లమెంట్.. కేసీఆర్ స్కెచ్ వెనుక కారణమిదీ..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్‌ విజయం సాధించి మూడో సారి ముఖ్యమంత్రి కావాలని ఆశపడ్డారు బీఆర్‌ఎస్‌ బాస్‌ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. కానీ, గెలుపు ముంగిట బొక్కబోర్లా పడ్డారు. విజయానికి 21 సీట్ల దూరంలో ఆగిపోయారు. ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. పరాభవం నుంచి ఇంకా గులాబీ బాస్‌ కోలుకోలేదు. ఈ క్రమంలో ఏర్పడిన కోపం, తాపం, ఫ్రస్ట్రేషన్‌ కారణంగా ఇటీవల ఆయన బాత్‌రూంలో జారిపడ్డారు. తుంటి ఎముక డ్యామేజ్‌ కావడంతో శస్త్ర చికిత్స చేసుకుని బెడ్‌ రెస్ట్‌…

TELANGANA

తెలంగాణ కాంగ్రెస్ ఆరు గ్యారంటీలకు అర్హతలు.. వాటి ప్రయోజనాలు ఇవీ..

తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు కసరత్తు ప్రారంభించింది. ఎన్నికల వేళ తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని టీపీసీసీ చీఫ్‌గా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈమేరకు డిక్లరేషన్లు కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ఇస్పటికే రెండు హామీల అమలు మొదలు పెట్టారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన రెండు రోజులకే(డిసెంబర్‌ 9 నుంచి) ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, మహాలక్ష్మి పథకంలో…

TELANGANA

2024-25 వార్షిక బడ్జెట్‌ వాస్తవికతను ప్రతిబింబించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు దిశానిర్దేశం..

2024-25 వార్షిక బడ్జెట్‌ వాస్తవికతను ప్రతిబింబించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆర్థిక శాఖపై సచివాలయంలో బుధవారం సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సవాళ్లు, లక్ష్యాలపై ప్రజలకు వాస్తవాలు చెబుదామన్నారు.   తెలంగాణ ఇప్పుడే వచ్చిందనుకొని బడ్జెట్‌ తయారు చేయాలన్నారు. ప్రజా శ్రేయస్సే అంతిమ లక్ష్యంగా బడ్జెట్‌పై కసరత్తు జరగాలని సీఎం అధికారులకు సూచించారు. హామీల అమలుకు వ్యయ అంచనాలు పక్కాగా ఉండాలన్నారు. ప్రజలకు అర్థమయ్యేలా బడ్జెట్‌…

TELANGANA

కాంగ్రెస్ గ్యారెంటీలు ఆరు.. మీకు దక్కాలంటే ఇలా చేయండి..

తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు కసరత్తు ప్రారంభించింది. ఎన్నికల వేళ తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని టీపీసీసీ చీఫ్‌గా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈమేరకు డిక్లరేషన్లు కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ఇస్పటికే రెండు హామీల అమలు మొదలు పెట్టారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన రెండు రోజులకే(డిసెంబర్‌ 9 నుంచి) ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, మహాలక్ష్మి పథకంలో…

TELANGANA

బీజేపీకి భారీ షాక్.. కాంగ్రెస్ లోకి ఇద్దరు బీజేపీ అగ్రనేతలు

పార్లమెంట్‌ ఎన్నికలకు పార్టీల సమాయత్తం.. ఈసారి లోక్‌సభ ఎన్నికలు నెల ముందే రావొచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నాయి. తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్‌ కూడా లోక్‌సభ ఎన్నికలపై దృష్టిపెట్టింది. ఈ క్రమంలో బీజేపీ కీలక సమావేశం డిసెంబర్‌ 28న కొంగరకలాన్‌లో జరుగనుంది. ఈ సమావేశానికి అమిత్‌షా హాజరుకానున్నారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఇప్పటికే సమీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ సారథ్యంలోని ఇండియా…

TELANGANA

రేవంత్‌కు ‘రేషన్‌’ టెన్షన్‌..

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలు దిశగా అడుగులు వేస్తోంది. పాలనలో తన మార్కు చూపించేందుకు కసరత్తు చేస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందే.. గ్యారంటీలను అమలు చేయడం ద్వారా లబ్ధి పొందాలని భావిస్తోంది. ఈ క్రమంలో పదేళ్లుగా కొత్త రేషన్‌ కార్డు కోసం ఎదురు చూస్తున్న అర్హులకు కొత్త కార్డుల జారీపై దృష్టిపెట్టింది. అయితే, ముందుగా ప్రస్తుతం ఉన్న రేషన్‌ కార్డులు రద్దు చేయాలని రేవంత్‌ సర్కార్‌ భావిస్తోంది. వాటిస్థానంలో డిసెంబర్‌…

TELANGANA

మరో యుద్ధానికి సిద్ధమైన కేసీఆర్‌.. స్వయంగా రంగంలోకి గులాబీ బాస్‌!

సిట్టింగుల మార్పు..? తెలంగాణలో ప్రస్తుతం బీఆరెస్‌కు 9 మంది సిటింగ్‌ ఎంపీలు ఉన్నారు. వీరిలో ఆరుగురిని మార్చే యోచనలో గులాబీ భవన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సిటింగ్‌లకు సీట్లు ఇవ్వడంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో నష్టపోయామనే భావనలో కేసీఆర్‌ ఉన్నారు. అందుకే సిటింగ్‌ ఎంపీలలో మార్పు తప్పదన్న ప్రచారం జరుగుతోంది. ముగ్గురు సిట్టింగ్‌లకు మాత్రం టికెట్‌ కన్ఫర్మ్‌ చేశారని సమాచారం. మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఆ స్థానం నుంచి పోటీ చేసి జాతీయ రాజకీయాల్లోకి…