మేడారం కోసం ప్రత్యేక బస్సులు.. ఆర్టీసీ ప్లానింగ్ ఇదీ..
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరపై ఆర్టీసీ దృష్టి పెట్టింది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిసెంబర్ 9 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో తెలంగాణ మహిళలందరికీ ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించారు. దీంతో ఆర్టీసీ ఆదాయం బాగా తగ్గింది. ఈ క్రమంలో మరో రెండు నెలల్లో ప్రారంభం కానున్న మేడారం జాతర ద్వారా ఆదాయం పెంచుకోవాలని ఆర్టీసీ చూస్తోంది. ఈమేరకు ప్రణాళిక రూపొందిస్తోంది. …

