TELANGANA

TELANGANA

తెలంగాణలో భూముల ధరల పెంపుకు ముహూర్తం ఫిక్స్..!

రాష్ట్ర ఆర్థిక పురోగతిని పరుగులు పెట్టించేందుకు, ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అవసరాలకు అనుగుణంగా అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోవడంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు. శుక్రవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన ‘రిసోర్స్ మొబిలైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ’ (ఆదాయ వనరుల సమీకరణ మంత్రివర్గ ఉపసంఘం) ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.   వివిధ శాఖల…

TELANGANA

నేడు సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం..!

రాష్ట్ర కేబినెట్ మీటింగ్ శనివారం సెక్రటేరియట్ లో జరగనున్నది. ఈ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ మీటింగ్ కు మంత్రులతో పాటు ముఖ్య అధికారులంతా హాజరు కానున్నారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా, ఆసరా ఫించన్లు పెంపు, ఇందిరమ్మ ఇళ్లు రెండో ఫేజ్, జర్నలిస్టులకు ఇళ్లు, అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన పొదుపు, సోలార్ వినియోగం తో పాటు మరి కొన్ని కీలక నిర్ణయాలపై డిస్కషన్ చేసే ఛాన్స్ ఉన్నది. కొత్త పథకాలపై కేబినెట్ నిర్ణయం…

TELANGANA

రేవంత్ కు కేటీఆర్ బహిరంగ లేఖ..!

తెలంగాణలో ప్రస్తుతం పంట కొనుగోళ్ల సంక్షోభం నెలకొందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా ఎంతకాలం మొద్దునిద్ర పోతారని ప్రశ్నిస్తూ ఆయనకు ఒక బహిరంగ లేఖ రాశారు. ఈ నెల 23న జరగబోయే రాష్ట్ర కేబినెట్ సమావేశంలోనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి, అన్నదాతల సమస్యలపై దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తొమ్మిదిన్నరేళ్ల పాటు బీఆర్ఎస్ హయాంలో కొండంత ధైర్యంతో బతికిన సాగు…

TELANGANA

కార్మికులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్‌.. కనీస వేతనాలు భారీగా పెంపు..!

తెలంగాణలోని కోట్లాది మంది కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్‌ చెప్పారు. రాష్ట్రంలో కనీస వేతనాల పెంపునకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదికకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.11 కోట్ల మంది కార్మికులకు ఆర్థికంగా లబ్ధి చేకూరనుంది.   మూడు జోన్లుగా విభజన కార్మికుల కనీస వేతనాలను శాస్త్రీయంగా నిర్ణయించేందుకు వీలుగా మొత్తం రాష్ట్రాన్ని ప్రభుత్వం మూడు జోన్లుగా వర్గీకరించింది. ఇందులో జోన్-1 కింద మున్సిపల్ కార్పొరేషన్లు, జోన్-2…

TELANGANA

ఫ్యూచర్ సిటీ ప్లాన్ అదిరింది.. అంతర్జాతీయ స్థాయిలో డిజైన్స్.. సీఎం రేవంత్ కీలక నిర్ణయాలు..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో పరిశ్రమల శాఖపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) అధికారులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణను పారిశ్రామికంగా ప్రపంచ పటంలో నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.   అంతర్జాతీయ స్థాయిలో ‘భారత్ ఫ్యూచర్ సిటీ’…

TELANGANA

బండి భగీరథ్ పోక్సో కేసు.. మరో సెక్షన్ ను జత చేసిన పోలీసులు..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్ కీలక సాక్ష్యాలను మాయం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెల 8న పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన వెంటనే ఫోన్ స్విచ్చాఫ్ చేసిన నిందితుడు, పరారీలో ఉన్న సమయంలో పథకం ప్రకారం తన అత్యాధునిక ఐఫోన్‌లోని డేటాను, కీలక వీడియోలను డిలీట్ చేయడమే కాకుండా, సోషల్ మీడియా అకౌంట్లను కూడా మాయం చేశాడు.   అరెస్ట్ అనంతరం పోలీసులు ఫోన్‌ను స్వాధీనం చేసుకోగా, అందులో…

TELANGANA

రేపు దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్.. ఒక్క హైదరాబాద్‌లోనే 16,000 దుకాణాలు క్లోజ్.!

ఆన్ లైన్ లో మెడిసన్స్ విక్రయాన్ని నిరసిస్తూ రేపు దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు మూతపడనున్నాయి. ఈ మేరకు ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్స్ (AIOCD).. రేపు బంద్ కు పిలుపునిచ్చింది. దీనికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్లు మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో బుధవారం సుమారు 12.40 లక్షలకు పైగా ఔషద దుకాణాలు, డిస్ట్రిబ్యూటర్లు.. తమ సేవలను నిలిపివేయనున్నారు.   కేంద్రం ప్రభుత్వం ఆన్ లైన్ మందుల సరఫరాకు…

TELANGANA

పాలమూరు ప్రాజెక్టులకు లైన్..!

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సస్యశ్యామలం కావాలంటే పాలమూరు సాగునీటి ప్రాజెక్టును వేగంగా నిర్మించాల్సిన అవసరం ఉన్నదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన ఎంసీఆర్ హెచ్ ఆర్ డీ లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.   ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పలు కీలక సూచనలు సీఎం ఇచ్చారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను దగ్గరుండి…

TELANGANA

ఇరిగేషన్ క్యాలెండర్‌లోకి మరో 11 ప్రాజెక్టులు..!

రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో ప్రకటించిన ఇరిగేషన్ క్యాలెండర్‌కు అదనంగా మరో 11 ప్రాజెక్టులను చేర్చి, వాటిని ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఇరిగేషన్ క్యాలెండర్‌లోని మొత్తం ప్రాజెక్టుల సంఖ్య 36కు చేరింది. సోమవారం సచివాలయంలో జలవనరుల శాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ మేరకు దిశానిర్దేశం చేశారు.   ఇటీవల కలెక్టర్ల సమావేశంలో 25 ప్రాజెక్టులతో ఇరిగేషన్…

TELANGANA

కాంగ్రెస్‌లో కొత్త మండల కమిటీలు.. వారికి మాత్రమే అవకాశం..?

కాంగ్రెస్ పార్టీలో కొత్త మండల కమిటీలు ఏర్పాటు కానున్నాయి. వేగంగా కొత్త కమిటీలు ఏర్పాటు కావాలని టీపీసీసీ ఆదేశించింది. అయితే ఇప్పటికే మూడేళ్ల పాటు కమిటీ అధ్యక్షులుగా పనిచేసిన వారికి మరోసారి అవకాశం లేదు. కొత్తోళ్లకు ఛాన్స్ ఇవ్వనున్నారు. కానీ కొత్తగా మండల కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునే వారు, అప్పటికే పార్టీలో కనీసం మూడేళ్ల పాటు కార్యకర్త గా పనిచేసి ఉండాలి. ఈసారి కమిటీల నియామకాల్లో కాంగ్రెస్ పార్టీ అత్యంత పారదర్శకమైన, కఠినమైన మార్గదర్శకాలను విధించింది.…