TELANGANA

TELANGANA

తెలంగాణ బీసీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాల పరీక్ష ఫలితాలు విడుదల

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని బీసీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి గంగుల కమలాకర్ సోమవారం ఈ ఫలితాలను విడుదల చేశారు. ఎంపీసీలో సిద్దిపేట జిల్లాకు చెందిన పీ జ్యోత్స్న 122 మార్కులతో తొలి ర్యాంక్ సాధించింది. బైపీసీలో నల్గొండ జిల్లాకు చెందిన పీ శ్రీవల్లి 108 మార్కులతో ఫస్ట్ ర్యాంక్ సాధించింది. సీఈసీలో పెద్దపల్లి జిల్లాకు చెందిన కే సాయి సంహిత 107 మార్కులతో, ఎంఈసీలో మేడ్చల్ జిల్లాకు చెందిన…

TELANGANA

ఎమ్మెల్యే రఘునందన్ రావుకు ఐఆర్‌బీ లీగల్ నోటీసులు: రూ. 1000 కోట్ల పరువు నష్టం దావా

హైదరాబాద్: బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుకు ఐఆర్‌బీ(IRB) సంస్థ లీగల్ నోటీసులు జారీ చేసింది. రూ. 1000 కోట్లకు పరువు నష్టం దావా వేస్తూ ఐఆర్‌బీ సంస్థ రఘునందన్ రావుకు సోమవారం లీగల్ నోటీసులు పంపింది. ఔటర్ రింగ్ రోడ్డు టోల్ కాంట్రాక్టును హెచ్ఎండీఏ సంస్థ ఐఆర్‌బీ సంస్థకు లీజుకు ఇచ్చింది. అయితే ఈ టెండర్ కేటాయింపులో అక్రమాలు జరిగాయని.. ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. నిబంధనలను తుంగలో తొక్కి హెచ్ఎండీఏ.. ఐఆర్‌బీ సంస్థకు…

TELANGANA

దశాబ్ది ఉత్సవాలపై కేసీఆర్ సమీక్ష: అమరుల స్మారకం ముందు తెలంగాణ తల్లి విగ్రహం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరగాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధికారులను మరోసారి ఆదేశించారు. ఇటీవల సచివాలయంలో కలెక్టర్ల సమావేశం నిర్వహించిన తర్వాత ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లకు సంబంధించిన పురోగతి గురించి డా. బిఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జూన్ రెండు నుంచి రోజూ వారీగా నిర్వహించ తలపెట్టిన కార్యక్రమాలకు సంబంధించి ఆయా శాఖలు తీసుకుంటున్న చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…

TELANGANA

టీఎస్‌పీఎస్సీ రవికిషోర్ బ్యాంక్ లావాదేవీల్లో ఏఈ పరీక్ష టాపర్ల వివరాలు, జిరాక్స్ సెంటర్లోనే

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) ప్రశ్నపత్రం లీకేజీ కేసులో సిట్ దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. ఏఈ సివిల్ మాస్టర్ ప్రశ్నపత్రం పెద్ద ఎత్తున చేతులు మారినట్లు అధికారులు భావిస్తున్నారు. ఇటీవల కీలక నిందితుడు రవికిషోర్ అరెస్టుతో మరికొంతమంది నిందితుల వివరాలు బయటపడుతున్నాయి. వరంగల్ విద్యుత్ శాఖ డీఈతోపాటు మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన నిందితులు సురేష్, రవికిషోర్, దివ్య, విక్రమ్ సైదాబాద్‌లో ఒకే భవన సముదాయంలో నివాసం ఉంటున్నారని పోలీసులు తెలిపారు.…

TELANGANA

రూ.500 నోట్లు కూడా రద్దు చేయండి- కేంద్రానికి చంద్రబాబు సలహా: నా వల్లే డిజిటల్ కరెన్సీ

రాజమండ్రి: రాజమండ్రి వేదికగా.. తెలుగుదేశం పార్టీ మహానాడును జరుపుకొంటోంది. ఇవ్వాళ రెండో రోజు. పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు శతజయంతి కూడా తోడుకావడంతో ఇవ్వాళ్టి కార్యక్రమాలను మరింత ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. పలు కీలక తీర్మానాలను ఆమోదించనుంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ సాయంత్రం తన ముగింపు సభలో పలు కీలక అంశాలను ప్రకటించే అవకాశం ఉంది. మహానాడులో చంద్రబాబు- ముగింపు ప్రసంగం చేశారు. రాష్ట్రాన్ని కాపాడుకునే విషయంలో రాజీపడే…

NationalTELANGANA

కేసీఆర్‌.. కేజ్రీవాల్‌ మీటింగ్ కి కారణం ఏంటి?

: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్య స్నేహ బంధం కొనసాగుతోంది. జాతీయ స్థాయిలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటూ ఉండగా.. మరో వైపు బీఆర్‌ఎస్ పార్టీతో జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య స్నేహం అనేది భవిష్యత్తులో బలమైన రాజకీయ పుణాదికి నాంది అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో…

TELANGANA

ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఇటీవల తాను సీఎం రేసులో లేనని ప్రకటన చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన పుట్టినరోజు వేడుకలలో మరోమారు సీఎం పదవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేడు నల్గొండ జిల్లాలోని బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్ వద్ద తన జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. 60వ జన్మదిన వేడుకలు జరుపుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ సందర్భంగా పలు…

TELANGANA

బంపర్ ఆఫర్.. రూ.2000 నోటు ఇస్తే రూ.2100 విలువైన వస్తువులు కొనొచ్చు.. !

గత శుక్రవారం ఆర్బీఐ రూ.2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటన చేసింది. సెప్టెంబర్ 30 వరకు రూ.2000 నోట్లు బ్యాంకుల్లో మార్చుకోవచ్చని చెప్పింది. దీంతో చాలా మంది తమ వద్ద ఉన్న రూ.2000 నోట్లను ఖర్చు పెడుతున్నారు. అయితే కొన్ని షాపుల్లో రూ.2000 నోట్లను తీసుకోవడం లేదు. కొంత మంది మాత్రం తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఢిల్లీలోని జీటీబీ నగర్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త రూ.2000 నోటుకు సంబంధించి ఓ ఆఫర్‌ను ప్రకటించారు. రూ.2000…

TELANGANA

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల తేదీ ఖరారు:

హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని విద్యార్థులు ఎదురుచూస్తున్న తెలంగాణ ఎంసెట్ ఫలితాల తేదీపై అధికారిక ప్రకటన వచ్చింది. మే 25న(గురువారం) ఎంసెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం ఉదయం 11 గంటలకు జేఎన్టీయూ(హైదరాబాద్)లోని గోల్డెన్ జూబ్లీ హాలులో ఫలితాలను విడుదల చేస్తారు. ఫలితాల పాస్‌వర్డ్ సీడీని 11.15 గంటలకు విడుదల చేయనున్నారు. అనంతరం విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. ఈ కార్యక్రమానికి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ…

TELANGANA

పంచాయతీ కార్యదర్శులకు శుభవార్త.. క్రమబద్దీకరణకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్..

జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి సర్వీసును క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను సీఎం కేసీఆర్ ఆదేశించారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పనితీరును మదింపు చేయడానికి జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు వేయాలని సీఎం చెప్పారు. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్ తో పాటు అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్), జిల్లా…