రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లకు 100 కోట్ల పరువునష్టం దావా వేసిన కేటీఆర్..
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లకు మంత్రి కేటీఆర్ ఊహించని షాక్ ఇచ్చారు. టీఎస్‌పీఎస్‌సీ వ్యవహారంలో తనపై నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేస్తున్నందుకు గాను.. ఆ ఇద్దరికీ పరువునష్టం దావా నోటీసులు ఇచ్చారు. రాజకీయ దురుద్దేశంతోనే తన పేరును అనవసరంగా లాగుతున్నారని.. తన న్యాయవాది ద్వారా ఆ ఇద్దరికి లీగల్ నోటీసులు పంపించారు. ఇండియన్ పీనల్ కోడ్‌లోని 499, 500 నిబంధనల ప్రకారం పరువునష్టం దావా నోటీసులు పంపారు. సుదీర్ఘకాలం పాటు…

