TELANGANA

TELANGANA

తెలంగాణలో సంచలనం సృష్టించిన పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్‌ కేసులో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు..

తెలంగాణలో సంచలనం సృష్టించిన పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్‌ కేసులో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. బుధవారం అర్ధరాత్రి కరీంనగర్‌లోని సంజయ్‌ నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ కార్యకర్తలు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు, బీజేపీ శ్రేణులకు తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. కాగా బండి సంజయ్‌ను హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా మంగ‌ళ‌వారం హిందీ పేప‌ర్ కాపీయింగ్ కేసులో…

APTELANGANA

ఏప్రిల్ 8వ తేదీన సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందేభారత్ ట్రైన్ పరుగులు…

సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందేభారత్ ట్రైన్ పరుగులు పెట్టనుంది. ఏప్రిల్ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనుల్లో భాగంగా హైదరాబాద్ విచ్చేయనున్న ప్రధాని మోదీ.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు రెండో వందేభారత్ రైలును గిఫ్ట్‌గా ఇవ్వనున్నారు. తొలి రోజు(ఏప్రిల్ 8) ఈ ట్రైన్ ఉదయం 11. 30 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరుతుంది. ఆ తేదీన నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి,…

TELANGANA

టీఎస్‌పీఎస్సీ పేపర్స్‌ లీకేజీ కథ మరో మలుపు..

టీఎస్‌పీఎస్సీ పేపర్స్‌ లీకేజీ కథ మరో మలుపు తిరిగింది. క్లైమాక్స్‌లో ప్రీ క్లైమాక్స్‌లాగా సడన్‌ ఎంట్రీ ఇచ్చింది ఈడీ. టీఎస్‌పీఎస్సీపేపర్స్‌ లీకేజీ వెనక ఆర్ధిక లావాదేవీలపై గురిపెట్టింది. కేసు ఫైల్‌చేసి 15మంది నిందితుల బ్యాంక్‌ అకౌంట్లపై ఫోకస్‌ పెట్టింది. సిట్‌ నుంచి వివరాలు తీసుకుని, ఆయా బ్యాంకులకు లేఖలు రాశారు అధికారులు. ఈడీ ఎంట్రీతో టీఎస్‌పీఎస్సీపేపర్స్‌ లీకేజీ ఎపిసోడ్‌ మరో మలుపు తిరిగినట్టయ్యింది. ఇప్పటివరకూ అసలు కుట్రధారులెవరు? లీకేజీ వెనక ఎవరున్నారనే కోణంలోనే సిట్‌ దర్యాప్తు సాగుతుంటే,…

TELANGANA

హైదరాబాద్‌ లో శ్రీరామ నవమి సందర్భంగా ఘనంగా రాములోరి శోభయాత్ర…

హైదరాబాద్‌ లో శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్‌ లో శ్రీరామ నవమి సందర్భంగా రాములోరి శోభయాత్ర ఘనంగా కొనసాగుతుంది. ఓల్డ్‌ సిటీలోని సీతారాంబాగ్‌ రామాలయంలో స్వామివారి కల్యాణం పూర్తి అయిన తర్వాత ఉత్సవ సమితి శ్రీరాముని శోభాయాత్రను ప్రారంభమైంది. ఈశోభాయాత్రలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటున్నారు.. దూల్ పెట్ సీతారాంబాగ్ ఆలయం నుండి ప్రారంభమైన శోభాయత్ర బోయగూడ కమాన్, మంగళ్ హాట్ జాలి హనుమాన్, దూల్ పేట, పురానాపూల్, జుమేరాత్ బజార్, చుడిబజార్, బేగంబజార్ చత్రి, బర్తన్…

APNationalTechnologyTELANGANAWorld

యూపీఏ చార్జీల మీద వివరణ..

యూపీఏ చార్జీల మీద వివరణ ఇచ్చింది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఏ). యూపీఏ వినియోగదారుల మీద ఎలాంటి భారం ఉండదని స్పష్టం చేసింది. ఏప్రిల్ 1 నుంచి కొత్త చార్జీలు అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం వ్యాపార సంస్థలే చార్జీలు చెల్లిస్తాయని స్పష్టం చేసింది. నియోగదారులకు తక్షణం ఎటువంటి చార్జీలు ఉండవని కేంద్రం వివరణ ఇచ్చింది. UPI చెల్లింపులపై ఛార్జీలు విధిస్తున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలను ఎన్‌పీసీఏ ఖండించింది. యూపీఐ ద్వారా బ్యాంకు ఖాతా నుంచి…

TELANGANA

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్‌ స్థాయి పోస్టులకు తుది రాతపరీక్షలు..

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్‌ స్థాయి పోస్టులకు తుది రాతపరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సాంకేతిక విభాగానికి సంబంధించి పోలీస్‌ రవాణా సంస్థలో డ్రైవర్, మెకానిక్‌, అగ్నిమాపక శాఖలో డ్రైవర్‌ ఆపరేటర్‌ కానిస్టేబుల్‌ అభ్యర్థులకు తుది రాత పరీక్షను హైదరాబాద్‌ కేంద్రంలో నిర్వహించున్నారు. ఏప్రిల్‌ 2వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) మంగళవారం (మార్చి 28) ప్రకటించింది.…

TELANGANA

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లకు 100 కోట్ల పరువునష్టం దావా వేసిన కేటీఆర్..

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లకు మంత్రి కేటీఆర్ ఊహించని షాక్ ఇచ్చారు. టీఎస్‌పీఎస్‌సీ వ్యవహారంలో తనపై నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేస్తున్నందుకు గాను.. ఆ ఇద్దరికీ పరువునష్టం దావా నోటీసులు ఇచ్చారు. రాజకీయ దురుద్దేశంతోనే తన పేరును అనవసరంగా లాగుతున్నారని.. తన న్యాయవాది ద్వారా ఆ ఇద్దరికి లీగల్ నోటీసులు పంపించారు. ఇండియన్ పీనల్ కోడ్‌లోని 499, 500 నిబంధనల ప్రకారం పరువునష్టం దావా నోటీసులు పంపారు. సుదీర్ఘకాలం పాటు…

TELANGANA

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్‌సీ) పేపర్ లీకేజీ వ్యవహారంతో కమీషన్ కీలక నిర్ణయం..

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్‌సీ) పేపర్ లీకేజీ వ్యవహారంతో కమీషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొన్ని పరీక్షలు రద్దు చేసి మరికొన్ని పరీక్షలను వాయిదా వేసిన కమీషన్.. తాజాగా టీఎస్​పీఎస్సీ నిర్వహించే హార్టికల్చర్​ ఆఫీసర్​ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 4న జరగాల్సిన ఈ పరీక్షను.. జూన్ 17వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ప్రశ్నపత్రాల లీకేజీ వల్ల 4 పరీక్షలను రద్దు చేయగా.. రెండింటిని వాయిదా…

TELANGANA

తెలంగాణలో రద్దయిన పరీక్షల కొత్త తేదీలను టీఎస్‌పీఎస్సీ త్వరలో ప్రకటించనుంది..

తెలంగాణలో ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా పలు నియామక పరీక్షలు రద్దైన సంగతి తెలిసిందే. రద్దయిన పరీక్షల కొత్త తేదీలకు సంబంధించిన షెడ్యూల్‌ను టీఎస్‌పీఎస్సీ త్వరలో ప్రకటించనుంది. గ్రూప్‌-1 ప్రిలిమినరీని రద్దు చేసిన రోజునే పునఃపరీక్ష తేదీని జూన్‌ 11గా నిర్ణయించింది. రద్దైన ఇతర పరీక్షలు ఏఈఈ, డీఏవో, ఏఈ పరీక్షలతోపాటు వాయిదా పడిన టీపీబీవో, వెటర్నరీ అసిస్టెంట్‌ పోస్టుల రాత పరీక్షలకు కొత్త తేదీలను ఖరారు చేయనుంది. కేంద్ర ప్రభుత్వ, వివిధ పోటీ పరీక్షల తేదీలను పరిశీలించి…

TELANGANA

దేశంలో త్వరలో రైతుల తుపాన్‌ రాబోతుంది..-: సీఎం కేసిఆర్.

దేశంలో త్వరలో రైతుల తుపాన్‌ రాబోతోందని.. దాన్నెవరూ ఆపలేరని బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఆదివారం మహారాష్ట్ర నాందేడ్‌ జిల్లాలోని లోహలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేసీఆర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని 75 ఏళ్లుగా పాలిస్తున్న కాంగ్రెస్‌, బీజేపీ మధ్య ఎలాంటి తేడా లేదని కేసీఆర్‌ విమర్శించారు. రైతులు ఐక్యంగా నిలిస్తే అడ్డుకోగల శక్తి ఎవరికీ లేదని అన్నారు. శివాజీ, అంబేడ్కర్‌ పుట్టిన నేలలో త్వరలోనే విప్లవం వస్తుందని…