బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవారికి ఇక నుండి చుక్కలే..!
సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ అమాయకుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఇన్‌ఫ్లుయెన్సర్ల మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. సోషల్ మీడియాలో పాపులారిటీ ఉందని అడ్డగోలుగా వ్యవహరిస్తామంటూ చట్టాలు చూస్తూ ఊరుకోవన్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ సోషల్ మీడియాలో ఫాలో కావద్దన్నారు. వెంటనే అలాంటి వారిని అన్ ఫాలో చేయాలని సూచించారు. “సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు అకౌంటబులిటీ అనేది ఉండాలి.…