ఆదిలాబాద్‌లో ఏసీబీ పంజా: రూ. 2 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ రెవెన్యూ ఉద్యోగి
ఆదిలాబాద్ జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మెరుపు దాడి నిర్వహించారు. బజార్‌హత్నూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న కటకం విద్యాసాగర్ రెడ్డి, ఓ రైతు నుంచి రూ. 2 లక్షల భారీ మొత్తాన్ని లంచంగా తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. సాదా బైనామా రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన దస్తావేజును ప్రాసెస్ చేసేందుకు ఆయన ఈ మొత్తాన్ని డిమాండ్ చేసినట్లు అధికారులు నిర్ధారించారు. బాధితుడు తన 8.35 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయం…

