మేడారం భక్తులకు గుడ్ న్యూస్: ఇంటికే సమ్మక్క-సారలమ్మ ప్రసాదం.. టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం!
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్లలేకపోయే భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ఒక అద్భుతమైన సేవను అందుబాటులోకి తెచ్చింది. రద్దీ వల్ల లేదా ఇతర వ్యక్తిగత కారణాల వల్ల మేడారం వెళ్లలేని వారు ఇప్పుడు కేవలం రూ. 299 చెల్లించి అమ్మవార్ల ప్రసాదాన్ని నేరుగా తమ ఇంటికే పొందే సౌకర్యాన్ని కల్పించింది. దేవాదాయ శాఖ సహకారంతో ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగం ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది.…

