ఆర్టీసీ ఛార్జీల పంపుపై కేటీఆర్ విమర్శలు..!
జీహెచ్ఎంసీ పరిధిలో అన్ని సిటీ బస్సు ఛార్జీలను టీజీఎస్ఆర్టీసీ పెంచింది. ఆర్టీసీ ఛార్జీలు పెంపుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు. సిటీ బస్సు ఛార్జీలను ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఒకేసారి 10 రూపాయలు పెంచి జంట నగరంలోని పేద, మధ్య తరగతి ప్రయాణికుల జేబులను కొల్లగొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. సామాన్యులపై ఛార్జీల భారం ‘పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో ప్రజలు అల్లాడుతున్న తరుణంలో, ప్రతి…

