అక్రమ టోల్ గేట్ కేసు.. మళ్లీ పోలీస్ కస్టడీకి మాజీ మంత్రి కాకాణి..
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. అక్రమ టోల్ గేట్ నిర్వహణకు సంబంధించిన కేసులో ఆయన్ను విచారించేందుకు న్యాయస్థానం పోలీసులకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈరోజు, రేపు ఆయనను పోలీసులు విచారించనున్నారు. వివరాల్లోకి వెళితే… కాకాణి గోవర్ధన్ రెడ్డిపై నమోదైన అక్రమ టోల్ గేట్ కేసులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో మరింత లోతైన విచారణ జరిపేందుకు, ఆయన్ను తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు…