World

World

మోదీ పర్యటన వేళ- భారతీయులకు శుభవార్త వినిపించిన ఫ్రాన్స్

పారిస్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఫ్రాన్స్ పర్యటన ఆరంభమైంది. ఈ మధ్యాహ్నం ఆయన పారిస్‌లో ల్యాండ్ అయ్యారు. విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఫ్రాన్స్ ప్రధానమంత్రి ఎలిజబెత్ బోర్నె స్వయంగా ఎయిర్‌పోర్ట్‌కు వచ్చి మోదీకి స్వాగతం పలికారు. అక్కడే సైనిక వందనాన్ని స్వీకరించారు మోదీ. ప్రవాస భారతీయులు ఆయనను కలుసుకున్నారు. అనంతరం ఫ్రాన్స్‌లో స్థిరపడిన ప్రవాస భారతీయులతో భేటీ అయ్యారు. ఇండియన్ డయాస్పొరాను ఉద్దేశించి ప్రసంగించారు. చంద్రయాన్ 3 ప్రయోగం సహా అనేక అంశాలను ప్రస్తావించారు.…

World

ప్రధాని మోడీకి యూఏఈ అధ్యక్షుడు ప్రత్యేక విందు: భారత్-యూఏఈల మధ్య కీలక ఒప్పందాలు

దుబాయ్: ఫ్రాన్స్ పర్యటన ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోడీ యూఏఈకి చేరుకున్నారు. యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ శనివారం అబుదాబికి చేరుకున్నారు. ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది. అనంతరం ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందాలు చోటు చేసుకున్నాయి. సరిహద్దు లావాదేవీల కోసం స్థానిక కరెన్సీల వినియోగాన్ని ప్రోత్సహించడానికి, వారి చెల్లింపు, సందేశ వ్యవస్థలను ఇంటర్‌లింక్ చేయడానికి భారతదేశం, యూఏఈ సెంట్రల్ బ్యాంక్‌లు రెండు అవగాహన…

World

అమెరికాలో కాల్పులు.. నలుగురు మృతి.. పరారీలో నిందితుడు

అమెరికాలో కాల్పుల ఘటన మరోసారి తెరపైకి వచ్చింది. అమెరికాలోని జార్జియాలో జరిగిన కాల్పుల్లో నలుగురు చనిపోయారు. కాల్పులకు పాల్పడిన నిందితుడు పరారీలో ఉన్నట్లు స్థానిక అధికారి ఒకరు వార్తా సంస్థకు తెలిపారు. అట్లాంటాకు దక్షిణంగా ఉన్న ఒక చిన్న కమ్యూనిటీలో జరిగిన కాల్పుల్లో కనీసం నలుగురు వ్యక్తులు మరణించారని జార్జియాలోని కౌంటీ ఓ ప్రభుత్వ అధికారి చెప్పారు. అట్లాంటాకు దక్షిణంగా ఉన్న హాంప్టన్ సబ్ డివిజన్‌లో శనివారం ఉదయం జరిగిన సామూహిక కాల్పులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు…

World

యుద్ధం మొదలై 500 రోజులు.. అయినా ఆగని పోరాటం..

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై 500 రోజులు పూర్తయింది. అయినా కూడా ఈ యుద్ధం ఆగడం లేదు. ఈ యుద్ధం ఉక్రెయిన్ ప్రజలను అస్థవ్యస్థం చేస్తోంది. చాలా మంది ప్రాణభయంతో విదేశాలకు వెళ్లారు. అక్కడున్న వారు బిక్కుబిక్కుమంటూ జీవనం వెళ్లదీస్తున్నారు. 60 లక్షలకు పైగా ఉక్రెయిన్ ప్రజలు శరణార్ధులుగా మారినట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఇప్పటి వరకు ఈ యుద్ధంలో 9 వేలకు పైగా సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయపడ్డారు. ఈ సుధీర్ఘ యుద్ధం…

World

మస్క్ మామ మైండ్ బ్లాక్.. రూల్స్ మార్చిన ట్విట్టర్.. !

ట్విట్టర్‌కు పోటీగా మెటా కొత్త యాప్‌ థ్రెడ్స్(Threads)ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. థ్రెడ్స్ గురువారం ఉదయం నుంచి వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఆండ్రాయిడ్‌, iOS ప్లేస్టోర్‌ రెండింటిలోనూ ఈ యాప్ అందుబాటులో ఉంది. థ్రెడ్స్ వచ్చిన మొదటి రోజే ట్విట్టర్ తన నిబంధనలు మార్చింది. థ్రెడ్స్ రాకతో కంగుతిన్న ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్ రూల్స్ ను మార్చారు. తిరిగి పాత నిబంధనలను తీసుకొచ్చారు. ట్విట్టర్ లో కొద్ది రోజుల క్రితమే ట్విట్టర్ లాగిన్ అయిన…

World

మాస్కో విమానాశ్రయంపై డ్రోన్లతో దాడి..

రష్యా రాజధాని మాస్కో వ్నుకోవో ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్టుపై డ్రోన్ల దాడి జరిగింది. ఈ దాడి రష్యా ఎయిర్ ఫోర్స్ సమర్ధవంతంగా తిప్పి కొట్టింది. ఉక్రెనియన్ డ్రోన్‌లు దాడి చేశాయని అధికారులు చెప్పారు. డ్రోన్ల దాడితో విమానాల రాకపోకలను నిలిపివేశారు. ఎయిర్ డిఫెన్స్ నాలుగు డ్రోన్‌లను ధ్వంసం చేసింది. మరొక డ్రోన్ ను ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్‌లను ఉపయోగించి నేలకూల్చినట్లు మాస్కోలోని రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం తెల్లవారుజామున తెలిపింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని టెలిగ్రామ్…

World

కెనడాలో ఖలిస్థాన్ మద్దతు దారులు, భారత మద్దతుదారులు పోటాపోటీ

కెనడాలో ఖలిస్థాన్ మద్దతు దారులు, భారత మద్దతుదారులు పోటాపోటీగా నిరసన తెలిపారు. తాజాగా కెనడాలోని భారతీయ దౌత్యవేత్తలను లక్ష్యంగా చేసుకుని ఒక పోస్టర్ గ్రేటర్ టొరంటో ఏరియా (జిటిఎ)లోని ఒక ఆలయం వెలుపల కనిపించింది. ఈ పోస్టర్ ఖలిస్థాన్ అనుకూలంగా ఉంది. బ్రాంప్టన్‌లోని భారత్ మాతా మందిర్ వెలుపల “వార్ జోన్” పేరుతో ఉన్న పోస్టర్ స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున ఉంచబడింది మరియు ఉదయం ఆలయ వాలంటీర్లు కనుగొన్నారు. ఆ తర్వాత పోస్టర్‌ను తొలగించినట్లు…

World

పాఠశాలలు తెరవాలని తాలిబన్లకు విజ్ఞప్తి

ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల పాలన ప్రారంభం నాటి నుంచి నుంచి బాలికలు, మహిళలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే ఆఫ్ఘనిస్థాన్‌లో పాఠశాలలు మూసివేయడంతో బాలికలు ఇప్పుడు కుట్టు కేంద్రాల వైపు మొగ్గు చూపుతున్నారు. వాస్తవానికి, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు మూసివేయబడిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌లో చాలా మంది బాలికలు అల్లికలు, కుట్టు శిక్షణ తీసుకుంటున్నారు. అదే సమయంలో వారు పాఠశాలలను తిరిగి తెరవాలని తాలిబన్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. తాలిబన్లు మహిళా విద్యార్థులకు మూసివేయబడిన కళాశాలలు, విశ్వవిద్యాలయాలను తిరిగి తెరవాలని కొందరు మహిళా విద్యార్థులు…

World

పాకిస్థాన్‍లో చైనా కుబేరుడు జాక్ మా

చైనా కుబేరుడు, అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా(Jack Ma) అనూహ్యంగా పాకిస్థాన్ లో పర్యటించారు. జాక్ మా జూన్ 29న లాహోర్‌కు చేరుకున్నారని, దాదాపు ఒకరోజు అక్కడే ఉన్నారని ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ నివేదికలు ధృవీకరించాయి. తన పర్యటనలో, జాక్ మా.. ప్రభుత్వ అధికారులు, మీడియా ప్రతినిధులకు దూరంగా ఉన్నారు. అతను ఒక ప్రైవేట్ ప్రదేశంలో బస చేశారు. జెట్ ఏవియేషన్ యాజమాన్యంలోని VP-CMA పేరుతో రిజిస్టర్ చేయబడిన ప్రైవేట్ జెట్ ద్వారా జూన్ 30న వెళ్లిపోయినట్లు…

NationalWorld

ఆ వాంతి ఖరీదు మూడు కోట్లు; ఎందుకు?

సహజంగా వాంతి అంటే అందరూ ముఖం అదోలా పెట్టుకుంటారు. మనుషులేనా, జంతువులైనా వాంతి చేసుకుంటే ఆ పరిసరాల్లో లేకుండా పారిపోతారు. కానీ తిమింగలాల వాంతి మాత్రం బంగారం కంటే విలువైనవిగా చూస్తారు. స్పెయిన్ లోని లాపాల్ మాలోని నొగాలస్ బీచ్ లోకి ఒక స్పెర్మ్ జాతి తిమింగలం కళేబరం కొట్టుకు వచ్చింది. ఇక దీనిపై పరిశోధన జరిపిన సైంటిస్టులు అందులో తిమింగలం వాంతి ఉన్నట్టు గుర్తించారు. సముద్రంలో తేలే బంగారం బాగా పిలిచే తిమింగలం వాంతి అది.…