అందరి ఫ్యాన్సేమో గానీ.. ప్రభాస్ ఫ్యాన్సుకున్న ఓపిక మూమూలుది కాదు. ఒక్కో ప్రాజెక్టుకి రెబల్ స్టార్ నెలల మీద నెలలు తీసుకోవడం వల్ల అభిమానులు సంవత్సరాలు పాటు వెయిట్ చేసినా తీరా థియేటర్లోకి ఎంట్రీ ఇచ్చాక బ్లాక్ బస్టర్ హిట్స్ మాత్రం అవ్వడం లేదు. దాంతో అప్ కమింగ్ సినిమాలతో అయినా అదరగొడతాడని ఆశలో ఉంటే ఆదిపురుష్ టీజర్ చూసి పెదవి విరిచారందరూ. రిలీజైన అన్ని భాషల్లోనూ నెగిటివ్ టాక్ నే మూటగట్టుకుందా టీజర్. దాంతో విజువల్ ఎఫెక్ట్స్ ని ఇంకాస్త గ్రాండ్ గా యాడ్ చేసి రిలీజ్ చేయడానికి చాలానే టైమ్ పట్టేలా ఉందట. నిజానికి ఆదిపురుష్ ఈ సంక్రాంతి బాక్సాఫీస్ బరిలోకి ఎంట్రీ ఇవ్వాల్సింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యమవడం వల్ల సమ్మర్ కి పోస్ట్ పోన్ అయింది. సమ్మర్ లో హాలీడేస్ ఉండడం వల్ల, విజువల్ ఎఫెక్ట్స్ తో కూడిన మైథాలజీ బ్యాక్ డ్రాప్ కావడంతో పిల్లలతో సహా పెద్దలు కూడా మూవీని ఎంజాయ్ చేస్తారు కాబట్టి కచ్చితంగా కలెక్షన్స్ భారీగానే వస్తాయని రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆశపడ్డారు. Adipurush Movie Will Release Next Year కానీ వచ్చే ఏడాది సంక్రాంతికి వచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. దీనికీ బలమైన కారణాలు కూడా లేకపోలేదు. అయోధ్యలో రామమందిరం 2024లో జనవరి ఒకటిన తెరుచుకోనుంది కాబట్టి. ఆదిపురుష్ రాముడి నేపథ్యంతో తెరకెక్కిన చిత్రం కాబట్టి.
. ఆ సందర్భం కలిసొచ్చినట్టూ ఉంటుంది, సంక్రాంతి బాక్సాఫీస్ మార్కెటూ వర్కవుటవుతుందన్న ప్లానులో ఉన్నారట మేకర్స్. ఇలాంటి వాయిదాల వార్తలు విన్నప్పుడు కామన్ ఆడియెన్సుకేమో గానీ.. ప్రభాస్ డైహార్డ్ ఫ్యాన్సుకి మాత్రం మిక్స్డ్ ఎమోషన్స్, రకరకాల రియాక్షన్స్ పాపం. ఇన్నాళ్లూ ఈగర్ గా వెయిట్ చేసినా మళ్లీ పోస్ట్ పోనా? అనే బాధ ఓవైపైతే.. లేటయితే అయింది. అవుట్ పుట్ బాగొస్తేనే కదా మూవీ సక్సెసయేది. ఎన్నిరోజులు ఆలస్యమైంది అనేదానికన్నా ఎన్నిరోజులు ఆడింది? ఎంత బడ్జెట్ ఖర్చయింది అనేదానికన్నా ఎంత వసూలు చేసింది? అనే లెక్కలు ముఖ్యం కాబట్టి.. విజువల్ ఎఫెక్ట్స్ కోసం నెలలు తీసుకున్నా స్క్రీన్ పై ఆ మ్యాజిక్ వర్కవుటయితే మా హీరోకి ఓ బాక్సాఫీస్ బంపర్ హిట్ పక్కా అనేది వాళ్ల ఆలోచన. Adipurush Movie Will Release Next Year మరోవైపు తోటి స్టార్ హీరోల సినిమాలు వరుసగా రిలీజవుతూ, ఒకదాని వెనక ఒకటి అనౌన్సవుతూ వాళ్ల అభిమానులు సంబరాల్లో, అప్ డేట్స్ తో హడావిడిలో ఉంటే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడో అనౌన్సయి, షెడ్యూల్స్ కంప్లీటయి ఇంకా థియేటర్లకి సినిమా కాదు కదా.. కనీసం మొబైల్స్ లోకి ట్రైలర్లు కూడా రాక బాధపడుతున్నారు. మరి అన్నీ అనుకున్నట్టుగా కుదిరి వచ్చే సంక్రాంతికయినా ఆదిపురుష్ ఆగమనం ఉంటుందా? లేక ముందుగానే విడుదలై ఆడియెన్సుని అలరిస్తారా అనేది చూడాలి మరి.