కొరటాల శివ.. తీసింది తక్కువ సినిమాలే అయినా బాక్సాఫీస్‌ను తన సినిమాలతో అల్లాడించాడు. వసూళ్ల వర్షంతో ప్రొడ్యూసర్లకు భారీ లాభాలు తెచ్చిపెట్టాడు. ఆచార్య సినిమా ముందు వరకు కొరటాలపై ఒక్కటంటే ఒక్క రిమార్కు కూడా లేదు. తీసిన సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలు ఆయన ఏంటో ప్రూవ్ చేశాయి. అయితే ఆచార్య విషయానికి వచ్చినప్పుడు మాత్రమే కొరటాలను పెద్ద ఎత్తున మెగా ఫ్యాన్స్ ట్రోల్స్ చేశారు. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఆచార్య అట్టర్ ప్లాప్ అయిపోయింది. అప్పటి నుంచి కొరటాల చేసిన తప్పు వల్లే ఆ సినిమా ప్లాప్ అయిందంటూ ఆయన్ను దారుణంగా విమర్శిస్తున్నారు కొందరు మెగా మద్దతు దారులు.
క్లారిటీ ఇస్తున్న కొరటాల.. కానీకొరటాల శివకూడా ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే ఉన్నాడు. సినిమా స్క్రిప్టు దగ్గరి నుంచి సీన్ల దాకా చాలా వరకు మెగాస్టార్ ఇన్వాల్వ్ కావడం వల్లే సినిమా ఇలా ప్లాప్ అయిందంటూ టాక్ వచ్చేలా చేశాడు. అయితే ఇప్పుడు మరికొన్ని వాల్యూయేబుల్ పాయింట్లను కూడా వదులుతున్నాడు కొరటాల. అవేంటంటే..ఆచార్యసినిమాకు ముందు ఆయన ముగ్గురు ప్రొడ్యూసర్లతో సినిమాలు చేశాడు. కానీ ఎవరూ కూడా ఇలా విమర్శలు చేయలేదు. ఎలాంటి ఆరోపణలు కూడా చేయలేదు. కానీ చిరంజీవి మాత్రం చాలా సార్లు కొరటాలను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించాడు. ఈ పాయింట్లను చూపిస్తూ కొరటాల తప్పు తనది ఒక్కడిదే కాదని.. తనను విమర్శించడం ఇప్పటికైనా ఆపాలంటూ కోరుతున్నాడు.